Air India Offer: రైలు ఛార్జీకే విమాన ప్రయాణం.. టాటాల బంపర్ ఆఫర్.. నాలుగు రోజులే
Air India Offer: టాటా గ్రూప్ ఎయిర్‌లైన్స్ ఎయిర్ ఇండియా క్రేజీ ఆఫర్‌ను ప్రారంభించింది. దీని కింద విమాన ప్రయాణం చేయాలనుకునే వారు రైలు ఛార్జీల రేటుకే పయనించొచ్చు.
ఎయిర్ ఇండియా గురించి ఆగస్టు 17న ప్రకటించింది. ప్రత్యేక సేల్‌లో దేశీయ రూట్లలో టిక్కెట్లు కేవలం రూ.1,470 నుంచి టిక్కెట్లు అందుబాటులోకి వచ్చాయి. అలాగే అంతర్జాతీయ విమానాల టిక్కెట్లు కూడా చౌకగా లభిస్తాయి. ఈ సూపర్ సేల్ కేవలం 96 గంటల పాటు మాత్రమే ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. దీనికింద ప్రయాణికులు వన్-వే ఎకానమీ క్లాస్ టిక్కెట్‌ను పొందుతారు.

ఇదే సమయంలో దేశీయ విమానాలకు బిజినెస్ క్లాస్ టిక్కెట్లు రూ.10,130 నుంచి ప్రారంభమవుతున్నాయి. అంతర్జాతీయ రూట్లలో నడిచే విమానాల సైతం ఆకర్షణీయమైన ఆఫర్లను అందుబాటులో ఉంచింది. దీనిద్వారా భవిష్యత్తు ప్రయాణాల కోసం కూడా టిక్కెట్లను కొనుక్కునే వెసులుబాటు ఉంది. అలాగే ఎయిర్ ఇండియా వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకుంటే.. ఎలాంటి కన్వీనియన్స్ ఛార్జీలు చెల్లించక్కర్లేదు. ఫ్లయింగ్ రిటర్న్స్ సభ్యులైతే.. అన్ని టిక్కెట్లపై డబుల్ లాయల్టీ బోనస్‌ను కూడా పొందవచ్చు.
ఈ ఆకర్షనీయమైన ఆఫర్ నేటి నుంచి ఆగస్టు 20 రాత్రి 11.59 గంటల వరకు మాత్రమే వినియోగించుకోగలరు. ఈ సేల్ కింద సెప్టెంబర్ 1, 2023 నుంచి అక్టోబర్ 31, 2023 వరకు ప్రయాణాల కోసం టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇప్పటికే స్పైస్ జెట్ స్వాతంత్ర్య దినోత్సవ విక్రయాలు కొనసాగిస్తున్న వేళ.. టాటాలు సైతం తమ ప్రయాణికులకు ఆఫర్ల వర్షం కురిపిస్తున్నారు. స్పైస్ జెట్ సేల్‌లో టిక్కెట్‌లను రూ.1,515 ప్రారంభ ధరతో అందిస్తోంది. దీని కింద 15 ఆగస్టు 2023 నుంచి 30 మార్చి 2024 వరకు టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications