Air India: టాటా గ్రూపుకు సంబంధించిన ప్రొడక్ట్స్, సేవలు అంటే క్వాలిటీకి పెట్టింది పేరు. వెనుదిరిగి చూడాల్సిన అవసరం ఉండదు అని అందరూ భావిస్తుంటారు. అయితే తాజాగా ఎయిర్ ఇండియా విషయంలో బయటకొచ్చిన వార్తలు చూస్తుంటే.. ఇదంతా అబద్ధం అనిపిస్తోంది.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)కి చెందిన ఇద్దరు సభ్యుల తనిఖీ బృందం ఎయిర్ ఇండియా భద్రతా రిపోర్టులను ఆడిట్ చేసింది. ఈ ప్రక్రియలో కొన్ని అంతర్గత భద్రతా లోపాలను గుర్తించినట్లు తెలిపింది. ఇవి చాలా కీలకమైనవి కాగా.. తదుపరి పరిశీలనకు రిఫర్ చేసినట్లు వెల్లడించింది.

క్యాబిన్ నిఘా, కార్గో, ర్యాంప్, లోడ్ మేనేజ్ మెంట్ సహా పలు విభాగాలను ఎయిర్ ఇండియా ఎప్పటికప్పుడు ఆడిట్ చేయాల్సి ఉంటుంది. 13 చెక్ పాయింట్స్ ను DGCA పరిశీలించగా.. అన్నింటిలోనూ తప్పుడు నివేదికలు పొందుపరిచినట్లు పేర్కొంది. పైగా వీటిపై చీఫ్ ఆఫ్ ఫ్లైట్ సేఫ్టీ(CFS) అధికారిక సంతకం సైతం లేదని నివేదించింది.
అయితే ఈ ఆడిటింగ్ ప్రక్రియ సాధారణంగా జరిగేదేనని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. అన్ని విమానయాన సంస్థల్లో నియంత్రణ విభాగం సహా ఇతర సంస్థలు భద్రతా తనిఖీలు నిర్వహిస్తాయన్నారు. ఒకవేళ ఏవైనా సమస్యలను గుర్తిస్తే, సంబంధిత అధికారుల సహకారంతో వెంటనే వాటిని పరిష్కరించేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు చెప్పారు.


Click it and Unblock the Notifications