టాటా-ఎయిర్‌బస్ కీలక ఒప్పందం, రూ.22,000 కోట్ల కాంట్రాక్ట్
రక్షణ రంగానికి అవసరమైన సీ-295 రవాణా విమానాలకు సంబంధించి భారత రక్షణ శాఖ, స్పేస్ స్పెయిన్ సంస్థల మధ్య నేడు ఒప్పందం కుదిరింది. ఈ డీల్ వ్యాల్యూ రూ.21 వేల కోట్లు (దాదాపు 3 బిలియన్ డాలర్లు). ఈ ఒప్పందం కింద ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు 56 విమానాలు అందిస్తారు. సీ-295 విమానాలు పాత ఏవీఆర్వో-748 విమానాల స్థానాన్ని భర్తీ చేస్తాయి. ఈ డీల్ ప్రకారం తొలి 16 విమానలను ఎయిర్ బస్ సంస్థ భారత్‌కు అందిస్తుంది. ఆ తర్వాత మిగతా 40 విమానాలను భారత్‌లోనే టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ తయారు చేస్తుంది.
రెండు కంపెనీల మధ్య కుదిరిన ఇండస్ట్రియల్ పార్ట్‌నర్‌షిప్ కింద వీటిని భారత్‌లో తయారు చేస్తారు. ఈ మేరకు ఎయిర్‌బస్ - టాటా ప్రాజెక్ట్ 56 సీ-295 ట్రాన్సుపోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్‌ను తయారు చేస్తుంది. ఈ ఒప్పందానికి సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ-ఎయిర్ బస్ మధ్య కాంటాక్ట్ సైన్ జరిగింది. ఎయిర్ బస్ రెండేళ్లలో మొదటి 16 విమానాలను అందిస్తుంది. మిగతా 40 విమానాలను టాటా కన్సార్టియం ఇక్కడే తయారు చేసి, పదేళ్లలో అందిస్తుంది.

ఓ భారతీయ ప్రయివేటు రంగ కంపెనీ విదేశీ టెక్నాలజీ ట్రాన్స్‌ఫార్మేషన్ ద్వారా మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్స్‌ను తయారు చేయడం ఇదే మొదటిసారి. తద్వారా హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL) గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టింది. సీ-295 ప్రాజెక్టు గత దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉంది. ఈ సందర్భంగా టాటా ట్రస్ట్స్ చైర్మన్ రతన్ టాటా మాట్లాడుతూ ఎయిర్ బస్ డిఫెన్స్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సంస్థల మధ్య కుదిరిన ఈ జాయింట్ ప్రాజెక్ట్ ఒప్పందం భారత్‌లోని ఏవియేషన్, ఏవియానిక్స్ ప్రాజెక్టులకు మేలు చేస్తుందన్నారు.


Click it and Unblock the Notifications