Tata News: దేశం కోసం ఎప్పుడైనా, ఏదానా చేసేందుకు సిద్ధంగా ఉండే మెుట్టమెుదటి వ్యాపార సంస్థ టాటా గ్రూప్. దేశానికి స్వాతంత్ర్యం రాక ముందు నుంచి వీరు అనేక రూపాల్లో దేశానికి తమ వంతు సహాయం చేస్తూనే ఉన్నారు.
తాజాగా సైన్యానికి అవసరమైన కీలక సాంకేతికలను టాటాలు సిద్ధం చేశారు. ఇప్పటికే భారత మిలిటరీ వినియోగించే అనేక ట్రక్కులు, ఆయుధాలు, వాటి విడిభాగాలను టాటా సంస్థలు తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే కొన్ని యంత్రాలు, జలాంతర్గాముులతో పాటు ఇతర రక్షణ వ్యవస్థలను విదేశీ సంస్థలతో కలిసి మేక్ ఇన్ ఇండియాలో భాగంగా కూడా టాటా గ్రూప్ దేశంలోనే తయారు చేయటంలో భాగంగా కూడా ఉంది.

చైనా-పాకిస్తాన్ సరిహద్దు భద్రతను పటిష్టం చేయడానికి టాటా గ్రూప్ సంస్థ టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ రంగంలోకి దిగింది. కంపెనీ హై-రిజల్యూషన్ ఇమేజరీ శాటిలైట్‌లను తయారు చేయడానికి కొత్త ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది. ఇవి చైనా-పాకిస్థాన్ సరిహద్దులను అధునాతన పద్ధతిలో పర్యవేక్షించేందు భారత ఆర్మీకి కీలకంగా వ్యవహరించనున్నాయి. బెంగళూరులోని టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ఫ్యాక్టరీ సబ్ మీటర్ రిజల్యూషన్ శాటిలైట్‌లను తయారు చేసేందుకు సిద్ధమైంది. దీనితో పాటు శాటిలైట్ల నిర్వహణకు బెంగళూరులో గ్రౌండ్ స్టేషన్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు.
గ్రౌండ్ స్టేషన్ ద్వారా ఉపగ్రహాల కదలికను నియంత్రించవచ్చు. బెంగళూరు నుంచే భారత సరిహద్దు వెంబడి సైనిక మౌలిక సదుపాయాలను పర్యవేక్షించేందుకు మార్గం సుగమం కానుంది. సైన్యం లక్ష్యస్థానానికి అవసరమైన చిత్రాలు ఇవి అందిస్తాయి. ఇందుకోసం టాటా గ్రూప్ లో ఎర్త్ ఆర్బిట్(LEO) ఉపగ్రహాలను తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వీటి తయారీ కోసం టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ఫ్యాక్టరీని స్థాపించడానికి లాటిన్ అమెరికాకు చెందిన శాటెలాజిక్‌తో జతకట్టింది. రానున్న 6 నెలల్లో 0.5 మీటర్ల రిజల్యూషన్‌తో కూడిన ఉపగ్రహాలను తయారు చేయాలని ఈ జోడీ నిర్ణయించింది.


Click it and Unblock the Notifications