For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Air India: ఎయిర్ ఇండియా ఫేట్ మార్చే ప్రణాళిక.. గ్లోబల్ బ్రాండ్ కానున్న ఎయిర్ ఇండియా..!

|

Air India: టాటా గ్రూప్ ఇటీవల కొనుగోలు చేసిన తర్వాత దూరమైన కస్టమర్లను చేరువచేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. వారికి విశ్వసనీయతతో సేవలను మెరుగుపరుస్తున్నట్లు కంపెనీ తెలిపింది. దీనికితోడు పెరుగుతున్న నెట్‌వర్క్, ఫ్లీట్‌పై దృష్టి పెట్టడానికి ఎయిర్ ఇండియా 5 ఏళ్ల ప్రణాళికను ఆవిష్కరించింది. దీనికి Vihaan.AI అని పేరు పెట్టింది. దేశీయ విమానయాన రంగంలో తన మార్కెట్ వాటాను కనీసం 30%కి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

మార్కెట్ లీడర్ గా మారేందుకు..

మార్కెట్ లీడర్ గా మారేందుకు..

ఎయిరిండియాను స్థిరమైన వృద్ధి, లాభదాయకత, మార్కెట్ నాయకత్వానికి మార్గంలో ఉంచడమే ఈ ప్రణాళిక లక్ష్యమని కంపెనీ వెల్లడించింది. ప్రణాళికను సిద్ధం చేసే క్రమంలో కంపెనీ తన ఉద్యోగుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంది. అసాధారణమైన కస్టమర్ అనుభవం, బలమైన కార్యకలాపాలు, పరిశ్రమ-ఉత్తమ ప్రతిభ, ఇండస్ట్రీ లీడర్షిప్, వాణిజ్య సామర్థ్యం, లాభదాయకతలు ఇందులో కీలక అంశాలుగా ఉన్నాయి.

చారిత్రాత్మక మార్పుకు నాంది..

చారిత్రాత్మక మార్పుకు నాంది..

కొత్త ఎయిర్ ఇండియా కోసం పునాది వేస్తున్నట్లు CEO క్యాంప్‌బెల్ విల్సన్ అన్నారు. కంపెనీని ప్రపంచ స్థాయి సంస్థగా మార్చేందుకు Vihaan.AI ప్రణాళికని అన్నారు. గ్లోబల్ కస్టమర్లకు సేవలు అందించటానికి ఎయిర్ ఇండియా పూర్తి స్థాయిలో సన్నద్దమౌతోందని తెలియజేశారు. ఇది నిజయంగా భారతీయులకు గర్వించదగ్గ విషయం.

90 ఏళ్ల కిందట..

90 ఏళ్ల కిందట..

JRD టాటా 90 ఏళ్ల క్రితం ఎయిర్ ఇండియా మొదటి విమానాన్ని పైలట్ చేశారు. అప్పటి నుంచి ఎయిర్ ఇండియా, దాని ఉద్యోగులు టాటా గ్రూప్‌లోకి తిరిగి రావడానికి ముందు అనేక సవాళ్లను ఎదుర్కొన్నట్లు కంపెనీ తెలిపింది. "Vihaan.AI అనేది గ్లోబల్ మ్యాప్‌లో ఎయిర్ ఇండియాను పునరుద్ధరించడానికి రోడ్ మ్యాప్, దీనిని ప్రపంచ స్థాయి, డిజిటల్, ఇండియన్ ఎయిర్‌లైన్‌గా మార్చడానికి ఉద్దేశించబడిందని కంపెనీ చెబుతోంది.

English summary

Air India: ఎయిర్ ఇండియా ఫేట్ మార్చే ప్రణాళిక.. గ్లోబల్ బ్రాండ్ కానున్న ఎయిర్ ఇండియా..! | Tata’s 5 yrs road map in name of Vihaan.AI to make it global player and grab market in indian aviation market

Tata’s 5 yrs road map in name of Vihaan.AI to make it global player and grab market in indian aviation market
Story first published: Thursday, September 15, 2022, 17:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X