Tasty Bite Stock: తక్కువ కాలంలో ఎక్కువ రాబడి కోసం చూసే ఇన్వెస్టర్ల సంఖ్య స్టాక్ మార్కెట్లలో ప్రపంచ వ్యాప్తంగా ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటారు. ఈ క్రమంలో చాలా మంది దీపావళి నాటికి లాభాలను తెచ్చిపెట్టే సరైన స్టాక్స్ కోసం మార్కెట్లో రీసెర్చ్ చేస్తున్నారు. అలాంటి వారికోసం ఇప్పుడు ఒక సదవకాశం ఉందని చెప్పుకోవచ్చు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది స్మాల్ క్యాప్ కేటగిరీకి చెందిన ఎఫ్ఎంసీజీ స్టాక్ టేస్టీ బైట్ ఈటబుల్స్ లిమిటెడ్ గురించే. ప్రస్తుతం ఈ స్టాక్ భారతీయ ఈక్విటీ మార్కెట్లలో పెద్ద సంచలనంగా మారింది. ఎందుకంటే గడచిన 5 ట్రేడింగ్ సెషనల్లో స్టాక్ ఏకంగా 40 శాతం కంటే ఎక్కువ రాబడిని అందించింది. నిపుణుల అంచనా ప్రకారం ఒక్కో షేరు ధర 2024 చివరి నాటికి ఏకంగా రూ.30,000లకు చేరవచ్చని తెలుస్తోంది. ఈ రోజు సైతం స్టాక్ 10 శాతం లాభపడింది. వాస్తవానికి ఆగస్టు 14, 2024న కంపెనీ షేర్ల ధర ఒక్కోటి రూ.9874 వద్ద ఉండగా నేడు అది రూ.14,000 స్థాయికి ఎగబాకింది. దీంతో దీపావళి నాటికి దీపావళి వరకు ఒక్కో షేరుపై రూ.16,000 లాభం ఖాయమని అభిప్రాయపడుతున్నారు.

నిన్న ట్రేడింగ్ సెషన్లో టేస్టీ బైట్ ఈటబుల్స్ లిమిటెడ్ షేర్లు 13 శాతానికి పైగా పెరుగుదలను చూశాయి. ర్యాలీ ఉన్నప్పటికీ టేస్టీ బైట్ ఈటబుల్స్ షేర్లు గత ఏడాది ఆగస్టులో చేరిన దాని రికార్డు గరిష్ట ధర రూ.18,399.85 కంటే దాదాపు రూ.4000 తక్కువ వద్ద ఒక్కో షేర్ ప్రస్తుతం మార్కెట్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం కంపెనీ స్టాక్ టెక్నికల్స్ పరిశీలిస్తే.. బలమైన బ్రేక్‌అవుట్‌ను చూపించిందని కేడియానోమిక్స్‌కు చెందిన సుశీల్ కేడియా పేర్కొన్నారు. దీపావళి, క్రిస్టమస్ నాటికి కంపెనీ షేర్ల ధర భారీగా పెరగవచ్చని ఆయన పేర్కొన్నారు. గతంలో సైతం టేస్టీ బైట్ ఇలాంటి ర్యాలీని చూసిందని కేడియా CNBC వాయిస్‌లో ఒక ప్రశ్నకు బదులిచ్చారు.
టేస్టీ బైట్స్ స్టాక్ గత చరిత్రను పరిశీలిస్తే.. ఏప్రిల్ 2020 నుంచి స్టాక్ రూ.7,500 నుంచి రూ.21,000కి పెరిగింది. తర్వాత ఏప్రిల్ 2023 నుంచి కంపెనీ షేర్లు రూ.8,500 నుంచి రూ.19,000 స్థాయికి ఎగబాకాయి. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్లకు అత్యధికంగా 74.23 శాతం వాటాలు ఉన్నాయి. అలాగే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 21.17 శాతంగా ఉండగా మిగిలిన మెుత్తాన్ని ఇతర కేటగిరీల ఇన్వెస్టర్లు హోల్డ్ చేస్తున్నారు. ఇక కంపెనీ వ్యాపారాన్ని పరిశీలిస్తే.. ప్రధానంగా రెడీ టూ ఈట్ ఆహారాలు, ఫ్రోజెన్ వెజిటెబుల్స్ కేటగిరీల్లో వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. టేస్టీ బైట్స్ అపోలో స్పేస్ ప్రోగ్రామ్ కోసం వినూత్న రిటార్ట్ పౌచ్‌లను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఈ రిటార్ట్ ప్యాకేజింగ్ క్యాంపర్‌లు, పర్వతారోహకులు, సెయిలింగ్ యాత్రలు, ఎడారి సఫారీల్లో టేస్టీ బైట్స్ ఉత్పత్తులను ఇష్టమైన ఎంపికగా మార్చింది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications