For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మాతో ఒప్పందానికి అమెరికా తహతహ, అందుకే ట్రేడ్ వార్: ట్రంప్‌కు చైనా షరతు

|

బీజింగ్: అమెరికాతో తొలి విడత వాణిజ్య ఒప్పందానికి ముందు అగ్రదేశం తమ దేశ వస్తువులపై వందల బిలియన్ల మేరకు విధించిన టారిఫ్‌ను తొలగించాలని చైనా మాజీ వాణిజ్య ఉపమంత్రి జియాంగ్ అన్నారు. చైనాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు అమెరికానే తహతహలాడుతోందని వ్యాఖ్యానించారు. అధిక టారిఫ్ నేపథ్యంలో తమతో ఒప్పందానికి చైనా చాలా ఆసక్తి చూపిస్తోందని, తాము నష్టపోతామని అందుకే ఒప్పందానికి తహతహలాడుతోందని డొనాల్డ్ ట్రంప్ కొద్ది రోజుల క్రితం అన్నారు. దానిపై చైనా మంత్రి ఇలా స్పందించారు.

IRCTC ఏజెంట్: నెలకు రూ.80,000 కూడా సంపాదించవచ్చు! ఎలాగంటే?IRCTC ఏజెంట్: నెలకు రూ.80,000 కూడా సంపాదించవచ్చు! ఎలాగంటే?

టారిఫ్ తొలగిస్తేనే..

టారిఫ్ తొలగిస్తేనే..

తమతో వాణిజ్య ఒప్పందానికి అమెరికానే ఆసక్తి కనబరుస్తోందని సదరు చైనా మంత్రి అన్నారు. కానీ కొన్ని టారిఫ్స్ తొలగించకుంటే ఈ డీల్‌కు తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు. కేవలం భవిష్యత్తులో విధించబోయే సుంకాలను నిలిపివేస్తామనే షరతుకు చైనా ఏమాత్రం అంగీకరించదని స్పష్టం చేశారు.

టారిఫ్ వెనక్కి తీసుకునే ఛాన్స్

టారిఫ్ వెనక్కి తీసుకునే ఛాన్స్

తొలి విడత వాణిజ్య ఒప్పందానికి ముందే అమెరికా కొన్ని చైనా ఉత్పత్తులపై సుంకాలను తొలగించే అవకాశముందని మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో ఆయన స్పందించారు. అమెరికా వివిధ సందర్భాల్లో టారిఫ్ విధించిందని, సెప్టెంబర్ 1 నుంచి 125 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులపై 15 శాతం టారిఫ్ విధించిందని, 250 బిలియన్ డాలర్ల వస్తువులపై 25 శాతం టారిఫ్ విధించిందని, వీటిని తొలగించే అవకాశముందని వార్తలు వచ్చాయి. అలాగే డిసెంబర్ 15వ తేదీ నుంచి అమలు కానున్న 156 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై విధించిన టారిఫ్ కూడా ఆపివేసే అవకాశముంది.

ట్రేడ్ వార్ అందుకే...

ట్రేడ్ వార్ అందుకే...

ఈ ట్రేడ్ వార్ అంతా టారిఫ్ గురించేనని, తాత్కాలిక వాణిజ్య ఒప్పందానికి ముందే వీటిని తొలగించాల్సి ఉందని, వీటి గురించి ఎందుకు అంతగా ప్రచారం చేస్తున్నారో తెలియడం లేదని చైనా అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ వైస్ చైర్మన్ అన్నారు. టారిఫ్ గురించే ట్రేడ్ వార్ అని, అలాంటప్పుడు వాటి ప్రస్తావన లేకుండా ఎలా ఉంటుందన్నారు. ఈ టారిఫ్స్ వల్ల అమెరికా, చైనాల వ్యాపారాలు దారుణంగా దెబ్బతిన్నాయన్నారు. చైనా కూడా అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై టారిఫ్ తొలగించవచ్చునని చెప్పారు. అమెరికాకు చెందిన 185 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై చైనా టారిఫ్ విధించింది.

English summary

మాతో ఒప్పందానికి అమెరికా తహతహ, అందుకే ట్రేడ్ వార్: ట్రంప్‌కు చైనా షరతు | Tariffs scheduled for December 15 won't pressure China into making a deal, Trump should cancel

New Tariffs Scheduled for December 15 Won't Pressure China Into Making a Deal. Donald Trump Should Cancel Them.
Story first published: Sunday, December 1, 2019, 13:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X