దీపావళి పండుగ డిమాండ్ పెరుగుదలకు అన్ని గోల్డ్ షాపులలో స్టాక్ త్వరగా ముగిసే అవకాశం ఉందంటా!
పండుగ సీజన్ అంటే ఇండియన్లకు గోల్డ్, సిల్వర్ కొనుగోలు చేసే సమయం. దీపావళి, ధన్తేరస్ సమీపంలో ఆభరణాలు, నాణేలు, బార్లను ఎక్కువుగా కొంటారు. ఎక్కువ మంది ఫ్యామిలీ కోసం, పెట్టుబడి కోసం, లేదా సంపదను ఆకర్షించే సంప్రదాయం కోసం ఈ సీజన్‌లో గోల్డ్, సిల్వర్ కొనుగోలు చేస్తారు. ఈ పండుగల్లో ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు, మరియు భవిష్యత్ ధరల పెరుగుదల భయంతో కొందరు ముందే స్టాక్ చేసుకుంటారు.

పండుగ సీజన్ మొదట కొంచెం నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ, ధన్తేరస్, దీపావళికి ముందే తనిష్క్ లో ఆభరణాల డిమాండ్ భారీగా పెరుగుతోంది. గోల్డ్ ధరలు 10 గ్రాములకి రూ. 1,29,440 కి చేరినా, కొనుగోలుదారులు ఇంకా వెనక్కి తగ్గలేదు. టైటన్ జ్యువెల్లరీ డివిజన్ CEO అజయ్ చావ్లా, "పండుగ సీజన్ కస్టమర్ల మనోభావాలను తిరిగి సజీవం చేసింది. చాలా మంది గోల్డ్ ధరలు తగ్గే వరకు వెయిట్ చేసుకున్నారు, కానీ ఇప్పుడు వారు తిరిగి మార్కెట్‌లోకి వస్తున్నారు. పండుగ సీజన్ ప్రారంభమైన తర్వాత మాత్రమే వాల్యూమ్ గ్రోత్ కనిపిస్తోంది. నవరాత్రి వరకు చాలా మంది దూరంగా ఉన్నారు, అందువల్ల వాల్యూమ్ స్పష్టంగా కనిపించలేదు. కానీ ఇప్పుడు గోల్డ్ ధరలు స్థిరంగా ఉన్నాయని, ఇంకా పెరుగుతాయని తెలుసుకున్న తర్వత తిరిగి వస్తున్నారు. కస్టమర్ల భవిష్యత్ సెంటిమెంట్ స్పష్టంగా తిరిగి వచ్చింది అని చెప్పారు.
ప్రస్తుత పండుగ సీజన్‌లో గోల్డ్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. 10 గ్రాములకి రూ. 1,29,440. అయినప్పటికీ, ధరలు ఎత్తు-తక్కువ అయినా డిమాండ్ తగ్గలేదు. చావ్లా ప్రకారం, ఇది FOMOని సెంటిమెంట్ ను పెంచింది. "ప్రజలు గోల్డ్ నాణేలు, బార్ల కోసం రన్నింగ్ చేస్తున్నారు. ఇది పెట్టుబడి కోసం కావచ్చు లేదా FOMO కారణంగా కావచ్చు. వారి భావన ప్రకారం బంగారం ధరలు ఇంకా పెరుగుతాయి," అని ఆయన తెలిపారు.
జ్యువెల్లరీ షాపులలో గోల్డ్ బార్లు తక్కువ కావచ్చు అనే ప్రశ్నకు చావ్లా గారు ఇలా చెప్పారు, డిమాండ్ పెరుగుతుందని ముందుగానే ప్లాన్ చేసుకున్నాం, కానీ స్టాక్ అయిపోతే షాక్ అవ్వాల్సిన అవసర లేదు. దేశంలో బులియన్ కొరత ఉంది, దానికి కస్టమర్లు గోల్డ్ కొరతకు ఆందోళన చెందుతున్నారు. పండుగ సీజన్‌లో తనిష్క్ లో ఆభరణాల డిమాండ్ పెరుగుతోంది, ధరలు ఎక్కువ ఉన్నప్పటికీ కస్టమర్లు కొనుగోలు చేస్తూనే ఉన్నారు. నాణేలు, బార్ల పై FOMO కారణంగా రన్నింగ్ జరుగుతోంది, మరియు స్టాక్ త్వరగా ముగిసే అవకాశం కూడా ఉంది.
పండుగల సమయంలో కస్టమర్లు కేవలం గోల్డ్ కోసం మాత్రమే రావడం కాదు, వారు భవిష్యత్తులో ధరలు పెరుగుతాయని భావించి FOMOలో ఉన్నారు. ఇది ఒక మానసిక ట్రెండ్, కాబట్టి చిన్న తేడా కూడా వారి కొనుగోలు నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది. కొందరు పెట్టుబడి కోసం కొనుగోలు చేస్తే, మరికొందరు సంపదను ఆకర్షించే సంప్రదాయానుసారం కొనుగోలు చేస్తున్నారు. ఈ మిశ్రమ భవిష్యత్తు-సాంప్రదాయ ప్రవర్తన గోల్డ్ డిమాండ్‌ను బలంగా ప్రేరేపిస్తోంది. ఇది కేవలం Tanishq లో మాత్రమే కాక, అన్ని గోల్డ్ షాపులలో కూడా ఇలానే పరిస్థితి ఉంటుంది. పండుగ సీజన్‌లో వినియోగదారులు అధికంగా వస్తున్నారు అని నిపుణులు చెప్తున్నారు.


Click it and Unblock the Notifications