మహిళల కోసం తమిళనాడు ప్రభుత్వం ఓ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) వ్యవస్థాపకుడు సిఎన్ అన్నాదురై జన్మదినాన్ని పురస్కరించుకుని తమిళనాడు ప్రభుత్వం మహిళల కుటుంబ పెద్దలకు నెలవారీ ఆర్థిక సహాయ పథకాన్ని శుక్రవారం ప్రారంభించింది. కలైంజర్ మగళిర్ ఉరిమై తిట్టం లేదా కలైంజ్ఞర్ మహిళా హక్కు పథకం కింద ఒక కుటుంబానికి చెందిన అర్హతగల మహిళా పెద్దలు వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా నెలకు రూ. 1,000 అందుకుంటారు. సిఎన్ అన్నాదురై జన్మస్థలమైన కాంచీపురం నుంచి ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఈ పథకాన్ని ప్రారంభించారు.
డిఎంకె ఎన్నికల వాగ్దానాలలో ఈ పథకం ఒకటి. ఈ సంవత్సరం సమర్పించిన రాష్ట్ర బడ్జెట్‌లో ఈ పథకానికి రూ. 7,000 కోట్లు కేటాయించారు. ఇది తమిళనాడు ప్రభుత్వానికి అత్యధిక ఖర్చు చేసే సామాజిక సంక్షేమ పథకంగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల వారు ఈ పథకం కోసం 1.63 కోట్ల దరఖాస్తు చేసుకున్నారు. ధృవీకరణ తర్వాత, అర్హత ప్రమాణాల ఆధారంగా 1.06 కోట్ల మంది మహిళలు షార్ట్‌లిస్ట్ అయ్యారు. ఈ పథకానికి అర్హత సాధించాలంటే.. 21 ఏళ్లు (సెప్టెంబర్ 15, 2002కి ముందు జన్మించిన), అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలి. ఆమె కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ. 2.5 లక్షల లోపు ఉండాలి.

5 ఎకరాల కంటే తక్కువ చిత్తడి నేల లేదా 10 ఎకరాల కంటే తక్కువ పొడి భూమి ఉన్నవారు దీనికి అర్హులు.మహిళ వార్షిక గృహ విద్యుత్ వినియోగం 3600 యూనిట్లకు మించకూడదు. ప్రభుత్వ ప్రధాన మహిళా అర్హత పథకం కలైంజర్ మగళిర్ ఉరిమై తొగై తిట్టం కింద నెలవారీ రూ.1,000 భృతికి 1.06 కోట్ల మంది మహిళలు అర్హులని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోమవారం తెలిపారు. డీఎంకే ఎన్నికల ముందు వాగ్దానం చేసిన ఈ పథకం కింద ప్రయోజనాలను పొందేందుకు ఇప్పటి వరకు దాదాపు 1.63 కోట్ల దరఖాస్తులు వచ్చాయని వివరించారు.
ప్రభుత్వం నెలవారీ డబ్బును నేరుగా మహిళా కుటుంబ పెద్దల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. దశలవారీగా లబ్ధిదారులందరికీ ATM కార్డులు అందజేయనున్నారు. సెప్టెంబర్ 15న లబ్ధిదారులకు తమ బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు విత్‌డ్రా చేయడంలో ఇబ్బందులు ఎదురైతే తెలియజేయాలని ఎస్‌ఎంఎస్‌తో పాటు టోల్‌ఫ్రీ నంబర్‌ను జోడించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications