Adani News: తమిళనాడుకి క్యూ కట్టిన అంబానీ, అదానీలు.. వేల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్ వెనుక ప్లాన్ ఇదే..
Investments in Tamilnadu: సిరులు కురిపించే వ్యాపారాలను ఎంచుకోవడంలో అంబానీ, అదానీల రూటే వేరు. అందుకే దేశంలో ఎంతో మంది బిజినెస్ మెన్ ఉన్నా.. వారిద్దరి సక్సెస్ రేటు ఎక్కువగా ఉంటుంది. ముఖేష్ అంబానీ తమిళనాడులో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు వార్తలు వస్తున్న సమయంలో.. అదానీ గ్రూప్ కూడా వేలాది కోట్లను అక్కడ కుమ్మరించడానికి సిద్ధమైంది.
పొరుగునున్న తమిళనాడులో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి, డేటా సెంటర్స్ ఏర్పాటుకి ముఖేష్ అంబానీ ప్లాన్ చేస్తున్నారు. అయితే అదానీ గ్రూప్ మాత్రం వివిధ వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫోర్డ్ కూడా ఇండియాలో తిరిగి కార్ల ఉత్పత్తిని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీటిని బట్టి చూస్తే స్టాలిన్ ప్రభుత్వం భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు అర్థమవుతోంది.

తమిళనాడులో పునరుత్పాదక ఇంధనం, సిమెంట్ తయారీ, డేటా సెంటర్, సిటీ గ్యాస్ పంపిణీలో వంటి వివిధ ప్రాజెక్టుల్లో 42 వేల 768 కోట్ల భారీ మొత్తాన్ని పెట్టుబడి పెట్టాలని అదానీ గ్రూప్ నిర్ణయించింది. దీనిద్వారా 10 వేల 300 మంది ఉపాధి అవకాశాలు సృష్టించే అవకాశం ఉంది. ఈ మేరకు ఆ రాష్ట్రంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ 2024 సందర్భంగా అదానీ గ్రూప్ తన భవిష్యత్ ప్రణాళికలను ప్రకటించింది.
ఇదే విషయంపై పెట్టుబడిదారుల సమావేశంలోనే అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ (APSEZ) CEO కరణ్ అదానీ మరియు తమిళనాడు ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం (MOU) కూడా కుదిరింది. అయితే మొత్తం ఇన్వెస్ట్‌మెంట్‌లో అదానీ గ్రీన్ కింద 24 వేల 500 కోట్లు, అంబుజా సిమెంట్స్ 3 వేల 500 కోట్లు, అదానీ కనెక్స్ 13 వేల 200 కోట్లు మరియు అదానీ టోటల్ గ్యాస్ & CNG కింద 1,568 కోట్లు చొప్పున పెట్టుబడి పెట్టనుంది.


Click it and Unblock the Notifications