జూలై 1 నుండి కొత్త లేబర్ కోడ్ వచ్చేనా? వారానికి 4 రోజుల పని, చేతికోచ్చే వేతనం తగ్గినా...
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన నాలుగు కార్మిక చట్టాలు జూలై 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చట్టాలకు సంబంధించి చాలా రాష్ట్రాలు నిబంధనలను రూపొందించినప్పటికీ, కొద్ది నెలలుగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ చట్టాలు అమల్లోకి వస్తే ఉద్యోగుల వేతనం, పీఎఫ్ కాంట్రిబ్యూషన్, పని, సమయం, వారాంతపు సెలవులు వంటి వాటిలో మార్పులు, చేర్పులు ఉంటాయి.
ఈ కొత్త చట్టాల ప్రకారం రోజువారీ పని గంటలు 8 నుండి 12 గంటలకు పెరుగుతుంది. అయితే ఇది తప్పనిసరి కాదు. కంపెనీ ఉద్యోగులను 8 గంటలకు బదులు 12 గంటలు పని చేయమని కోరవచ్చు. ఈ లెకనక వారంలో మూడు వీక్లీ ఆఫ్స్ వస్తాయి. వారానికి గరిష్టంగా48 గంటలు మాత్రమే పని చేయాలి. ఒకవేళ ఏదైనా కంపెనీ 8 గంటలు మాత్రమే పని చేయించుకుంటే వారంలో ఒక వారాంతపు సెలవు మాత్రమే వస్తుంది.

అయితే కొత్త కార్మిక చట్టాల ప్రకారం మొత్తం శాలరీలో బేసిక్ తగ్గుతుంది. ఎందుకంటే బేసిక్ శాలరీ కనీసం సగం ఉండాలి. అలవెన్స్ 50 శాతానికి మించవద్దు. ఈ లెక్కన బేసిక్ పెరిగితే ఆ మేర పీఎఫ్ కాంట్రిబ్యూషన్ పెరుగుతుంది. దీంతో చేతికి వచ్చే వేతనం తగ్గుతుంది. కానీ రిటైర్మెంట్ తర్వాత అంతకుమించి వస్తుంది. గ్రాట్యుటీ కూడా ఎక్కువే వస్తుంది. ప్రయివేటు సంస్థలు తమ ఉద్యోగులకు అలవెన్స్ ఎక్కువగా ఇస్తాయి. కాబట్టి వారికి చేతికి వచ్చేది తగ్గినప్పటికీ, మొత్తానికి భవిష్యత్తులో అంతకుమించి వస్తుంది. ఇక, కొత్తగా ఉద్యోగంలో చేలిన వారు ప్రస్తుతం 240 రోజుల తర్వాత సెలవులు పొందవచ్చు. కానీ కొత్త నిబంధనల తర్వాత 180 రోజులకు వర్తిస్తుంది.


Click it and Unblock the Notifications