ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ (OnePlus) ఇప్పుడు చిక్కుల్లో పడింది. ఆ సంస్థ సీఈఓ పీట్ లౌ (Pete Lau) పై తైవాన్ ప్రాసిక్యూటర్లు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. తైవాన్ చట్టాలను అతిక్రమించి, రహస్యంగా వ్యాపార కార్యకలాపాలు సాగించడమే కాకుండా అక్రమంగా ఉద్యోగులను నియమించుకున్నారనేది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ.

అసలు గొడవ ఏంటి?
తైవాన్, చైనా మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతల గురించి మనందరికీ తెలిసిందే. తైవాన్‌లోని 'క్రాస్-స్ట్రెయిట్ యాక్ట్' (Cross-Strait Act) ప్రకారం.. ఏ చైనీస్ కంపెనీ అయినా తైవాన్‌లో వ్యాపారం చేయాలన్నా లేదా అక్కడి వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవాలన్నా ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి. అయితే వన్ ప్లన్ సీఈఓ(OnePlus CEO) పీట్ లౌ ఈ చట్టాలను తుంగలో తొక్కినట్లు తైవాన్ అధికారులు గుర్తించారు. 2015లోనే హాంకాంగ్ కేంద్రంగా ఒక షెల్ కంపెనీని (నకిలీ సంస్థ) ఏర్పాటు చేసి, దాని ద్వారా తైవాన్‌లో రహస్యంగా ఒక బ్రాంచ్ ను తెరిచినట్లు ఆరోపణలు ఉన్నాయి.
70 మంది ఇంజనీర్లతో సీక్రెట్ R&D!
ప్రాసిక్యూటర్ల సమాచారం ప్రకారం, వన్‌ప్లస్ సంస్థ తైవాన్‌లో సుమారు 70 మంది కంటే ఎక్కువ మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను రహస్యంగా నియమించుకుంది. వీరంతా వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లకు సంబంధించిన అప్లికేషన్ రీసెర్చ్, డెవలప్‌మెంట్, టెస్టింగ్ పనుల్లో నిమగ్నమయ్యారు. తైవాన్ లోని అత్యున్నత టెక్నాలజీ ప్రతిభను (Tech Talent) దొంగచాటుగా వాడుకోవడమే ఈ సంస్థ లక్ష్యమని అధికారులు మండిపడుతున్నారు.
డబ్బులు ఎలా వచ్చాయి?
తైవాన్ లోని ఈ రహస్య కార్యకలాపాల కోసం వన్‌ప్లస్ సుమారు 2.3 బిలియన్ తైవాన్ డాలర్లను (సుమారు 73 మిలియన్ డాలర్లు) కేటాయించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ మొత్తాన్ని సాఫ్ట్‌వేర్ అమ్మకాల ఆదాయంగా చూపిస్తూ.. హాంకాంగ్ ద్వారా తైవాన్‌కు మళ్లించినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో పీట్ లౌకు సహకరించిన ఇద్దరు తైవాన్ పౌరులపై కూడా ఇప్పటికే అభియోగాలు నమోదయ్యాయి.
తైవాన్ ఎందుకు ఇంత సీరియస్‌గా ఉంది?
సెమీ కండక్టర్లతో పాటు సాఫ్ట్ వేర్ రంగంలో తైవాన్ ప్రపంచానికే గుండెకాయ వంటిది. చైనా కంపెనీలు తైవాన్ ప్రతిభను అక్రమంగా దొంగిలిస్తే అది తమ జాతీయ భద్రతకు ముప్పు అని తైవాన్ భావిస్తోంది. అందుకే గత ఏడాది కాలంలోనే ఇలాంటి అక్రమ రిక్రూట్‌మెంట్లు చేస్తున్న 16 చైనీస్ కంపెనీలపై తైవాన్ దాడులు నిర్వహించింది.
పీట్ లౌ పరిస్థితి ఏంటి?
అరెస్ట్ వారెంట్ జారీ అయినప్పటికీ, పీట్ లౌ ప్రస్తుతం చైనాలో ఉండటం వల్ల తక్షణమే అరెస్ట్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే తైవాన్, చైనా మధ్య నేరస్థుల అప్పగింత ఒప్పందం (Extradition Treaty) లేదు. కానీ, ఆయన ఇతర దేశాలకు వెళ్లినప్పుడు లేదా తైవాన్ మిత్రదేశాల పరిధిలోకి వచ్చినప్పుడు అరెస్ట్ అయ్యే ముప్పు ఉంటుంది. ఇది వన్‌ప్లస్, దాని మాతృ సంస్థ ఒప్పో (Oppo) అంతర్జాతీయ ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం ఉంది.
మొత్తానికి టెక్నాలజీ రంగంలో నైపుణ్యం కోసం చైనా కంపెనీలు చేస్తున్న ఈ 'సీక్రెట్ ఆపరేషన్లు' ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

Bengaluru: టీసీఎస్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! మీ స్నేహితుడిని చేర్పించండి.. రూ. 40,000 గెలుచుకోండి!

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

Gold: బంగారం ధరలు తగ్గేది అందుకు కాదు! అసలు విషయం బయటపెట్టిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీఈఓ!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

పెరుగుతున్న బంగారం ధరలు.. అదే స్థాయిలో పెరుగుతున్న పసిడి రుణాలు.. ఎందుకు తాకట్టు పెడుతున్నారు..

బంగారం ధర పెరగడంతో వినియోగదారులు కొత్త స్కెచ్.. రూ.4 లక్షల కోట్లు దాటిన పసిడి రుణాలు..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బెంగళూరు-హైదరాబాద్ మధ్య ప్రయాణం గంటలే.. 110 కి.మీ.వేగంతో కొత్త రైలు వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..

బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే.. 11 ఇంటర్‌ఛేంజెస్ కనెక్టివిటితో బిజినెస్ కారిడార్ రెడీ..



Click it and Unblock the Notifications