Racist Taiwan: కాలం మారుతున్నా ఆయా దేశాలు, పెద్దస్థాయిల్లోని వ్యక్తులు విద్వేషాలు వెదజల్లడం మాత్రం అలాగే కొనసాగుతోంది. ఇండియన్స్ ద్వారా పెద్ద మొత్తంలో ఆర్జిస్తున్న మాల్దీవుల మంత్రులు, ఇటీవల మన ప్రధాని సహా భారతీయులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. దానికి పర్యవసానాన్ని ఆ దేశం అనుభవిస్తోంది. కాగా ఇప్పుడు తైవాన్ చుట్టూ కూడా ఇదే తరహా వివాదం చెలరేగింది.
తైవాన్, భారత్ మధ్య మంచి ఆర్థిక సంబంధాలున్నాయి. ఆ దేశానికి చెందిన ఫాక్స్‌కాన్ వంటి సంస్థలు ఇండియాలో భారీగా పెట్టుబడులు పెట్టాయి. చైనా దుందుడుకు చర్యలకు తనదైన శైలిలో కౌంటర్ ఇస్తూ భారత్ ఎప్పుడూ తైవాన్‌కు మద్ధుతగా నిలుస్తూ వస్తోంది. అయితే అక్కడ మాస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు ముందు తైవాన్ లేబర్ మంత్రి తమ కలర్ చర్మం ఉన్న వలసదారులనే రిక్రూట్ చేస్తానంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదానికి కారణమయ్యాయి.

కొంతమంది భారతీయుల చర్మం రంగు, మతం మరియు ఆహార వ్యవహారాల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అనంతరం ఆ దేశం డ్యామేజ్ కంట్రోల్‌కి దిగింది. హ్సు మింగ్-చున్ చేసిన వ్యాఖ్యలకు తైవాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ క్షమాపణలు చెప్పింది. జాతితో సంబంధం లేకుండా భారతీయ కార్మికులందరినీ తమ దేశం స్వాగతిస్తున్నట్లు చెప్పింది. న్యాయంగా వ్యవహరిస్తామని, చట్ట ప్రకారం రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చింది.
'ఇటీవల కొన్ని ప్రభుత్వ సంస్థలు పూర్తిగా సరికాని వ్యాఖ్యలు చేశాయి. ఇది తైవాన్ సమాజం, భారతీయ స్నేహితులు మరియు ఇతర అంతర్జాతీయ వాటాదారుల విమర్శలకు దారితీసింది. ఈ పరిస్థితికి ప్రభుత్వం క్షమాపణలు తెలియజేస్తోంది. వీటిని తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకుంటుంది' అని ప్రకటించింది.
అయితే వృద్ధ జనాభాతో సతమతమవుతున్న తైవాన్ వలస కార్మికులకు సంబంధించి ఇటీవలే భారత్‌తో ఒప్పందం చేసుకుంది. ఇంతలోనే జాత్యహంకార వ్యాఖ్యలు చేయడాన్ని భారతీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆ దేశాన్ని ఏకి పారేస్తున్నారు. తైవాన్ ను చైనా ఆక్రమించే విషయంలో భారత్ స్పందించడం మానేయాలని కోరుతున్నారు. 'రేసిస్ట్ తైవాన్' హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications