ఆన్‌లైన్ చెల్లింపుల కోసం తెలంగాణ ప్రభుత్వం టీ-వ్యాలెట్ యాప్‌ను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ఇది త్వరలో కేంద్రం తీసుకు వచ్చిన రూపే కార్డుతో అనుసంధానం కానుంది. దీంతో వ్యాలెట్ ఆధారిత రూపే కార్డు అందుబాటులోకి వస్తుంది. ఈ కార్డు వినియోగంతో ఎట్టి పరిస్థితుల్లోను బ్యాంకు వివరాలు తెలిసే అవకాశం ఉండదు. అంటే చెల్లింపులకు అదనపు రక్షణ. ఇవి ప్రభుత్వ సంస్థలు కావడంతో డిజిటల్ పేమెంట్స్‌కు మరింత భద్రత ఉంటుందనే భరోసా ఉంటుంది. రూపే కార్డు జారీకి కేంద్రం నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అనుమతించారు. కేవైసీ పూర్తి చేసుకున్న వారికి కార్డును జారీ చేస్తారు.

ఇలా పని చేస్తుంది...
ప్రస్తుతం టీ-వ్యాలెట్ గూగుల్ పే, ఫోన్ పే వంటి సాధారణ పేమెంట్స్ యాప్ వలె పని చేస్తుంది. రిజిస్టర్ అయిన వినియోగదారులు తమ బ్యాంకు వివరాలు లేదా డెబిట్ కార్డు వివరాల ఆధారంగా వ్యాలెట్‌లో డబ్బులు యాడ్ చేసుకోవచ్చు. ఎక్కడైనా చెల్లింపులు జరిపే సందర్భంలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేయవచ్చు. ఇప్పుడు అదనంగా రూపే కార్డును మంజూరు చేయనున్నారు. పేమెంట్స్ చేసే సమయంలో వ్యాలెట్‌లోని మొత్తాన్ని యాప్‌తో స్కాన్ చేయడం ద్వారా లేదా కార్డుతో స్వైప్ చేయడం ద్వారా పూర్తి చేయవచ్చు. సాధారణ డెబిట్, క్రెడిట్ కార్డుల మాదిరిగా టీ-రూపే కార్డుకు కూడా కార్డు నెంబర్, సీవీవీ నెంబర్, ఎక్స్‌పైరీ తేదీ ఉంటాయి.

అదనపు రక్షణ
టీ-రూపే కార్డు వినియోగిస్తే బ్యాంకు వివరాలతో అవసరం లేదు. వ్యాలెట్‌లోని డబ్బులు మాత్రమే కార్డులో కనిపిస్తాయి. కార్డు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కినా నష్టం ఉండదు. ట్రాన్సాక్షన్స్‌కు అదనపు రక్షణ ఉంటుంది. ప్రభుత్వం నుండి అనుమతులు వచ్చాక త్వరలో ఫిజికల్ కార్డును లాంచ్ చేస్తామని, దీనికి సీవీవీ నెంబర్, ఎక్స్‌పైరీ తేదీ ఉంటుందని టీ-వ్యాలెట్ ప్రోగ్రాం హెడ్ శ్రీనివాసులు ఇటీవలే అన్నారు. తాజాగా అనుమతులు వచ్చాయి.

డిజిటల్ ప్రోత్సాహం కోసం
డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహానికి 2017 జూన్ 1న తెలంగాణ ప్రభుత్వం దేశంలో తొలిసారి వ్యాలెట్‌ను ప్రవేశపెట్టింది. యాప్, వెబ్‌సైట్‌తో పాటు ఫీచర్ ఫోన్‌లో కూడా ఈ వ్యాలెట్ సేవలు వినియోగించుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ లేనివారు సమీపంలోని మీ-సేవకు వెళ్లి టీ-వ్యాలెట్ అకౌంట్ తెరిచి, డబ్బులు వేసుకోవచ్చు. మీ-సేవ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ఆర్టీఏ, విద్యుత్, ఓఆర్ఆర్ బిల్లులు కూడా చెల్లించవచ్చు.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications