ఈ రోజుల్లో చాల మంది ఇన్వెస్ట్మెంట్స్ పై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అందులో మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ఒక మంచి మార్గం. ఎందుకంటే SIP గురించి అత్యంత గొప్ప విషయం ఏమిటంటే, దీనిని చిన్న పెట్టుబడితో ప్రారంభించవచ్చు. ఇది కాకుండా, SIPలో వారానికో, నెలకో లేదా 3 నేలల ప్రాతిపదికన పెట్టుబడి పెట్టవచ్చు. ప్రజలు వారి ఆర్థిక పరిస్థితిని బట్టి ఎప్పుడైనా పెట్టుబడి మొత్తాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ పెట్టుబడి మొత్తం సంబంధిత వ్యక్తి బ్యాంకు అకౌంట్ నుండి ఆటోమేటిక్'గా డెబిట్ అవుతుంది.

ఈ రోజుల్లో చాల మంది భవిష్యత్తు గురించి ఆలోచనతో ఉంటున్నారు. ఇంకా పెద్ద మొత్తం కూడబెట్టడానికి సహాయపడే పెట్టుబడి అప్షన్స్ కోసం వెతుకుతూనే ఉంటాడు. SIPలో క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు పెద్ద మొత్తం ఎలా సృష్టించవచ్చో చూద్దాం... గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, మీరు SIPలో ముందుగానే పెట్టుబడి పెట్టడం ప్రారంభించి, ఎక్కువ కాలం కొనసాగిస్తే మంచి కాంపౌండింగ్ పొందువచ్చు.
SIP కాల్క్యూలేషన్
టార్గెట్ కార్పస్: రూ. 85 లక్షలు
ప్రతినెల పెట్టుబడి: రూ. 5 వేలు
అన్యువల్ రాబడి: 12 శాతం
ప్రతి నెలా రూ. 5 వేలు పెట్టుబడి పెట్టడం ద్వారా రూ. 85 లక్షలకు పైగా కార్పస్ జమ చేయడానికి దాదాపు 25 సంవత్సరాలు పడుతుంది.
ఈ విధంగా డబ్బు పెరుగుతుంది: 10 సంవత్సరాలలో ప్రతినెల రూ. 5 వేల పెట్టుబడితో పెట్టుబడి మొత్తం రూ. 6,00,000, కాపిటల్ లాభాలు రూ. 5,20,179, కార్పస్ అంచనా రూ. 11,20,179 అవుతుంది. అదేవిధంగా 15 సంవత్సరాల కాలంలో పెట్టుబడి మొత్తం రూ. 9,00,000, కాపిటల్ లాభాలు రూ. 14,79,657, కార్పస్ రూ. 23,79,657 అవుతుంది.
ఈ విధంగా మీరు మీ టార్గెట్ చేరుకుంటారు: 20 సంవత్సరాలలో ప్రతినెల SIP రూ. 5 వేలతో పెట్టుబడి మొత్తం రూ. 12,00,000 అవుతుంది, కాపిటల్ లాభాలు రూ. 33,99,287, కార్పస్ అంచనా రూ. 45,99,287 అవుతుంది. 25 సంవత్సరాలలో పెట్టుబడి మొత్తం రూ. 15,00,000, కాపిటల్ లాభాలు రూ. 70,11,033, కార్పస్ అంచనా రూ. 85,11,033 అవుతుంది. ఈ విధంగా మీరు మీ టార్గెట్ చేరుకుంటారు.
కంపౌండింగ్ అంటే ఏమిటి: కాంపౌండింగ్ గురించి మాట్లాడుకుంటే రాబడిపై రాబడిని సంపాదించడం అని అర్థం. దీనిని చక్రవడ్డీ అని కూడా అంటారు. కాంపౌండింగ్ కాలక్రమేణా ప్రిన్సిపాల్ అండ్ అక్యూములాటేడ్ వడ్డీ రెండింటిపై రాబడిని ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది, ఇది లాంగ్ టర్మ్ వృద్ధికి దోహదం చేస్తుంది. అందుకే చక్రవడ్డీ కొన్నిసార్లు నమ్మలేని ఆశ్చర్యమైన ఫలితాలను ఇస్తుంది.


Click it and Unblock the Notifications