IPO Gains: తొలిరోజే 40% పెరిగిన స్టాక్.. పండుగ చేసుకుంటున్న ఇన్వెస్టర్లు.. ఈరోజే లిస్టింగ్..
IPO Gains: దేశంలో ప్రస్తుతం ఐపీవోల పండుగ కొనసాగుతోంది. చాలా కంపెనీలు తమ మూలధన అవసరాల కోసం స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కు వస్తున్నాయి. ఈ క్రమంలో నేడు కొత్తగా స్టాక్ ఎక్స్ఛేంజ్ లో లిస్ట్ అయిన ఈ స్టాక్ మెగా రాబడిని అందించింది.

లిస్టింగ్ మెుదటి రోజే..
సిర్మా SGS టెక్నాలజీషేర్లు శుక్రవారం BSE, NSEలో దాదాపు 19 శాతం ప్రీమియంతో లిస్టయ్యాయి. లిస్టింగ్ అయిన కొద్దిసేపటికే.. సిర్మా SGS టెక్నాలజీ షేర్లలో బంపర్ ర్యాలీ జరిగింది. కంపెనీ షేర్లు BSEలో రూ.262 వద్ద ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఇన్వెస్టర్ల నుంచి షేర్లకు వచ్చి కొనుగోళ్ల మద్ధతు కారణంగా స్టాక్ దాదాపు 35% పెరిగి దాని ఆల్-టైమ్ గరిష్ఠ స్థాయి అయిన రూ.295కి చేరుకుంది.

షేర్ ఇంట్రాడే పరుగులు..
మార్కెట్లోకి కొత్తగా అరంగేట్రం చేసిన స్టాక్ ఇంట్రాడేలో కంపెనీ షేర్లు దాదాపు 40% పెరిగి రూ.307.90కి చేరుకుంది. దీంతో ఐపీవోలో షేర్లు ఎలాట్ అయిన ఇన్వెస్టర్లు బంపర్ లాభాలను చూశారు. గత కొంత కాలంగా వచ్చిన ఐపీవోలు నిరాశపరిచినప్పటికీ.. ఈ స్టాక్ మాత్రం ఇన్వెస్టర్లకు లాభాల పండుగను తెచ్చింది. ఐపీవోలో ఒక్కోస్టాక్ బ్యాండ్ ఫ్రైస్ రూ.209 నుంచి రూ.220 మధ్య కంపెనీ నిర్ణయించింది.

ఇన్వెస్టర్లు ఏమి చేయాలి?
స్టాక్ మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. లిస్టింగ్ లాభాల కోసం షేర్లను కొన్ని ఇన్వెస్టర్లు తమ పెట్టుబడిపై ఇప్పటికే మంచి లాభాన్ని పొందారు. కాబట్టి వారు ప్రాఫిట్ బుక్కింగ్ తీసుకోవటం సరైనదని వారు సూచిస్తున్నారు. ఇదే సమయంలో దీర్ఘకాలం పెట్టుబడి వ్యూహంతో షేర్లను కొన్నవారు రూ.225 స్టాప్ లాస్ తో వాటిని హోల్డ్ చేయవచ్చని సూచిస్తున్నారు. ప్రస్తుతం స్వల్పకాలిక లాభాలను బుక్ చేసుకుంటారు కాబట్టి డ్రాప్ తర్వాత కొనుగోలు అవశాలను వీరు అందిపుచ్చుకోవచ్చని నిపుణులు చెప్పారు.

ఐపీవోపై ఇన్వెస్టర్ల స్పందన..
ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ కంపెనీ తాజా ఐపీవోకు దేశంలోని ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించింది. ఆగస్టు 12-18 మధ్య కాలంలో ఈ ఇష్యూ దాదాపు 32.61 సార్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. ఇన్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి ప్రధాన మద్దతు లభించింది. వారి కోసం కంపెనీ అందించిన వాటాను 17.5 రెట్లు బుక్ చేసుకున్నారు. ఇష్యూ రిటైల్ కోటా కంటే 5.53 రెట్లు అధికంగా సబ్‌స్క్రైబ్ చేయబడింది.


Click it and Unblock the Notifications