buy back: ప్రస్తుత మార్కెట్ ధరతో పోలిస్తే దాదాపు రెట్టింపు విలువతో షేర్ల బై బ్యాక్ చేస్తామని ఓ కంపెనీ ప్రకటిస్తే ఏమౌతుంది. అమాంతం ఆ షేర్ వాల్యూ దూసుకుపోతుంది. సింఫనీ విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగింది. ప్రకటన వెలువడిన అనంతరం షేరు విలువ 12 శాతం పైకి ఎగబాకింది. త్రైమాసిక ఫలితాలు సైతం బాగుండటంతో చెలరేగిపోయింది.

డబుల్ ధమాకా:
షేర్ హోల్డర్ల నుంచి రూ.2 ముఖ విలువ కలిగిన కంపెనీ ఈక్విటీ షేర్లను బైబ్యాక్ చేయున్నట్లు సింఫనీ(Symphony) ప్రకటించింది. ప్రస్తుత మార్కెట్ ధర రూ.1,047 ఉండగా.. రూ.2,000 చొప్పున తిరిగి కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. రికార్డ్ తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు వెల్లడించింది. టెండర్ ఆఫర్ విధానంలో స్టాక్ ఎక్స్ఛేంజ్ ద్వారా ఈ కొనుగోళ్లు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఒక్కో షేరుకు రూ.2 వేల చొప్పున రూ.200 కోట్లకు మించకుండా ఈ డీల్ పూర్తిచేయనున్నట్లు ఓ ప్రకటనలో చెప్పింది.

సెబీ నిబంధనల మేరకే..
ఈక్విటీ షేర్ల బైబ్యాక్ ద్వారా 10 లక్షల షేర్లను తిరిగి కొనుగోలు చేయాలని సింఫనీ చూస్తోంది. కాగా మార్చి 31, 2022 నాటికి కంపెనీ మొత్తం ఈక్విటీ క్యాపిటల్ లో ఈ షేర్ల వాటా 1.43 శాతం. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి స్టాండ్ ఎలోన్, కన్సాలిడేటెడ్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్ మెంట్‌ల ప్రకారం.. SEBI నిర్దేశించిన బై బ్యాక్ నియమాలకు లోబడి ఈ డీల్ పూర్తి చేస్తున్నట్లు తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ లో కంపెనీ పేర్కొంది. నియంత్రణ సంస్థ నిర్దేశించిన 25 శాతం లోపు అంటే పూర్తిగా చెల్లించిన ఈక్విటీ మూలధనం, ఫ్రీ రిజర్వ్స్ మొత్తం 24.76, 24.69 శాతంగానే ఉన్నాయని వెల్లడించింది.

భారీగా పెరిగిన షేర్ ధర:
బైబ్యాక్ ప్రకటన తర్వాత సింఫనీ షేరు ధర 8.47 శాతం పెరిగి రూ.1,047 వద్ద ట్రేడ్ అయింది. అనంతరం 12 శాతాన్ని సైతం టచ్ చేసింది. డిసెంబర్ 2022 త్రైమాసిక ఫలితాలను సైతం బుధవారమే విడుదల చేయడమూ ఈ భారీ పెరుగుదలకు ఓ కారణమైంది. గత త్రైమాసికంలో అత్యధిక స్టాండలోన్ అమ్మకాలను నమోదు చేసినట్లు అందులో ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల్లో వాణిజ్య, పారిశ్రామిక అవసరాల కోసం ఎయిర్ కూలర్‌లు, పర్యావరణ అనుకూల ఉత్పత్తుల తయారీపై ప్రస్తుతం దృష్టి పెట్టింది.
More From GoodReturns

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..



Click it and Unblock the Notifications