Sylvan Plyboard IPO: జూన్ మాసం తొలిరోజే ఐపీవోలు ఇన్వెస్టర్లను సంతోషంలో నింపేస్తున్నాయి. వాస్తవానికి నేడు మార్కెట్లోకి వచ్చిన రెండు ఐపీవోలు బంపర్ లిస్టింగ్ నమోదు చేసి పెట్టుబడిదారులను ధనవంతులుగా మార్చేశాయి. దీంతో చాలా మంది చిన్న ఐపీవోలపై బెట్టింగ్ చేయటం లాభదాయకమేనని భావిస్తున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది సిల్వాన్ ప్లైబోర్డ్ కంపెనీ గురించే. నేడు మార్కెట్లో జాబితాకు వచ్చిన చిన్న కంపెనీ ఐపీవో షేర్లు 20% ప్రీమియం ధరతో ఎన్ఎస్ఈ ఎస్ఎమ్ఈలో రూ.66 వద్ద మార్కెట్‌లో బంపర్ లిస్టింగ్ నమోదు చేశాయి. అలాగే లిస్టింగ్ జరిగిన కొద్దిసేపటికే కంపెనీ షేర్లు ఇంట్రాడేలో అప్పర్ సర్క్యూట్ తాకాయి. వాస్తవానికి కంపెనీ ఒక్కో షేరును గరిష్ఠంగా రూ.55 ధర వద్ద ఇష్యూ చేసింది. వాస్తవానికి ఐపీవో రిటైల్ ఇన్వెస్టర్ల సబ్‌స్క్రిప్షన్ కోసం జూన్ 24 నుంచి జూన్ 26 వరకు తెరిచి ఉంచబడింది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ మార్కెట్ల నుంచి రూ.28.05 కోట్లను సమీకరించింది.

అద్భుతమైన లిస్టింగ్ తర్వాత సిల్వాన్ ప్లైబోర్డ్ షేర్లు దాదాపు 5% పెరిగి రూ.69.20కి చేరుకున్నాయి. తాజా ఐపీవో నుంచి సమీకరించిన మెుత్తాన్ని కంపెనీ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలతోపాటు సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం వినియోగించాలని నిర్ణయించింది. అలాగే ఐపీవోలో రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 84.11 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. ఇతర కేటగిరీలు 75.42 శాతం సబ్‌స్క్రైబ్ అయ్యాయి. పెట్టుబడిదారుల కోసం లాట్ పరిమాణాన్ని కంపెనీ 2000 షేర్లుగా నిర్ణయించటంతో రిటైల్ ఇన్వెస్టర్లు పాల్గొనేందుకు కనీసం రూ.1.10 లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది.
ఇదే సమయంలో కంపెనీ వ్యాపారం గురించి పరిశీలిస్తే సంస్థ 2002లో స్థాపించబడింది. సిల్వాన్ ప్లైబోర్డ్ ప్లైవుడ్, బ్లాక్‌బోర్డ్, ఫ్లష్ డోర్, వెనీర్, సాన్ కలప వంటి వివిధ చెక్క ఉత్పత్తుల తయారీ వ్యాపారంలో కొనసాగుతోంది. అలాగే కంపెనీ ఉత్పత్తులన్నీ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి. కంపెనీకి 13 రాష్ట్రాల్లో 223 అధీకృత డీలర్లు ఉన్నారు. కంపెనీ ప్రమోటర్లుగా సింగ్ సప్లయర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆనంద్ కుమార్ సింగ్, జై ప్రకాష్ సింగ్, శకుంతలా సింగ్, కళ్యాణి సింగ్ ఉన్నారు.
More From GoodReturns

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు



Click it and Unblock the Notifications