Cerelac News: మీరూ మీ పిల్లలకు సెరెలాక్ ఆహారంగా ఇస్తున్నారా.? షాకింగ్ వార్త తెలుసుకోండి..
Nestle India: మనలో చాలా మంది నెస్లే కంపెనీ తయారు చేసే బేబీ ఫుడ్ సెరెలాక్ చిన్నప్పుడు తినే ఉంటాం. పుట్టిన తర్వాత ఏడాది వరకు నెలల పిల్లలకు ఆహారంగా ఎక్కువమంది తల్లిదండ్రులు దీనినే అందిస్తుంటారని మనందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన ఒక షాకింగ్ వార్త ప్రస్తుతం చాలా మందిని ఆందోళనకు గురిచేస్తోంది.
ప్రపంచంలోనే అతిపెద్ద బేబీ ఫుడ్స్ ఫార్ములా తయారీదారుగా ఉన్న నెస్లే.. భారతదేశంతో పాటు ఇతర ఆసియా, ఆఫ్రికన్ దేశాల్లో విక్రయించే బేబీ మిల్క్ & ఫుడ్ సప్లిమెంట్ సెరెలాక్‌లో చక్కెరను జోడిస్తుందని వెలుగులోకి వచ్చింది. స్విస్ పరిశోధనా సంస్థ పబ్లిక్ ఐ షాకింగ్ రిపోర్ట్‌లో ఈ విషయం వెల్లడైంది. నెస్లే నిడో, సెరెలాక్ నమూనాల్లో సుక్రోజ్ లేదా తేనె రూపంలో చక్కెర కనుగొనబడిందని నివేదిక పేర్కొంది. నిడో వాస్తవానికి ఏడాది లోపు వయస్సు ఉండే పిల్లలకు పాలుగా ఉపయోగించబడుతుంది. అలాగే సెర్లెక్ 6 నెలల నుంచి 2 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు తృణధాన్యంగా వినియోగిస్తుంటారు.

ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలో విక్రయించే స్విస్ బహుళజాతి కంపెనీ బేబీ-ఫుడ్ ఉత్పత్తుల నమూనాలను సంస్థ పరీక్షల కోసం బెల్జియన్ ప్రయోగశాలకు పంపినప్పుడంతో ఈ విషయం వెల్లడైంది. ఈ ఉత్పత్తులు 2022లో కేవలం భారతదేశంలోనే 250 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ అమ్మకాలు జరిగాయి. అన్ని సెరెలాక్ బేబీ ఫుడ్ ప్రతి సర్వింగ్‌కు సగటున 3 గ్రాముల చక్కెరను కలిగి ఉంటాయి. దక్షిణాఫ్రికాలో కూడా అదే పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్న అన్ని సెరెలాక్స్‌లో ఒక్కో సర్వింగ్‌కు 4 గ్రాములు లేదా అంతకంటే ఎక్కువ చక్కెర ఉన్నట్లు పరీక్షలో వెల్లడైంది.
ప్రపంచంలోని రెండవ అతిపెద్ద మార్కెట్ అయిన బ్రెజిల్‌లో 2022లో దాదాపు $150 మిలియన్ల అమ్మకాలు జరిగాయి. సెరెలాక్ బేబీ ఫుడ్‌లో సగటున 3 గ్రాముల చక్కెరను కలిగి ఉన్నట్లు గుర్తించబడింది. బ్రెజిల్‌లో సెరెలాక్‌ను ముసిల్లాన్ అని పిలుస్తారు. ఇక్కడ ఉన్న ఎనిమిది ఉత్పత్తులలో రెండింటిలో మాత్రమే చక్కెర జోడించబడలేదు. కానీ మిగిలిన ఆరింటిలో ఒక్కో సర్వింగ్‌లో దాదాపు 4 గ్రాముల చక్కెర ఉంది. నైజీరియాలో చక్కెర స్థాయి ఏకంగా 6.8 గ్రాముల వరకు ఉంది. ఫిలిప్పీన్స్‌లో పిల్లల కోసం తయారు చేసిన ఉత్పత్తులలో చక్కెర జోడించబడదు. ఇక చివరిగా ఇండోనేషియాలో డాంకోగా విక్రయించే నిడో బేబీ ఫుడ్‌లో ప్రతి సర్వింగ్‌కు 0.8 గ్రాముల చక్కెర ఉంది. అయితే చిన్నప్పటి నుంచే చక్కెరను ఆహారంలో ఇవ్వటంపై కొందరు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నివేదిక కంపెనీపై ప్రతికూల ప్రభావాన్ని చూపే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications