ఆ వ్యాపారంలో 70% వాటా అమ్మేసిన కోటక్ మహీంద్రా బ్యాంక్..!
Kotak General Insurance: గత కొన్ని నెలల కిందట రిజర్వు బ్యాంక్ ఆంక్షలకు గురైన కోటక్ మహీంద్రా బ్యాంక్ తాజాగా తన వ్యాపారంలో మెజారిటీ వాటాను విక్రయించటం ఆందోళన కలిగిస్తోంది. వివరాల్లోకి వెళితే..
స్విస్ ఇన్సూరెన్స్ కంపెనీ జ్యూరిచ్ ఇన్సూరెన్స్ తాజాగా దేశీయ ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం కోటక్‌తో రూ.5,560 కోట్ల డీల్‌ను పూర్తి చేసింది. దీనిలో భాగంగా కోటక్ మహీంద్రా జనరల్ ఇన్సూరెన్స్‌లో 70% వాటాను జ్యూరిచ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసింది. వాస్తవానికి ఈ డీల్ గత ఏడాది నవంబరులోనే ప్రకటించబడింది.

తాజా డీల్ తర్వాత జ్యూరిచ్ భారతదేశంలోకి ప్రవేశించిన మొదటి విదేశీ ఇన్సూరెన్స్ కంపెనీగా అవతరించింది. భారత ప్రభుత్వం 2021లో ఈ రంగంలో విదేశీ యాజమాన్యాన్ని 49 శాతం నుంచి 74 శాతానికి పెంచుతూ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ నియమాలను సవరించింది. దీని తర్వాత తాజా డీల్ జరిగిన సంగతి తెలిసిందే. కోటక్ మహీంద్రా బ్యాంక్ మార్చి 2024 నాటికి బీమా అనుబంధ సంస్థలో రూ.875 కోట్ల చెల్లింపు మూలధనంలో 100% ఈక్విటీని కలిగి ఉంది. మోటార్ ఇన్సూరెన్స్ ద్వారా కోటక్ జనరల్ ఎఫ్ఐ 24లో ప్రీమియం ఆదాయంగా రూ.748 కోట్లు, హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి రూ.620 కోట్ల ఆదాయాన్ని పొందింది.
కోటక్ జనరల్ లో వాటాల కొనుగోలుపై జ్యూరిచ్ ఇన్సూరెన్స్ గ్రూప్ ఆసియా-పసిఫిక్ సీఈవో స్పందిస్తూ.. కోటక్ జనరల్ ఇన్సూరెన్స్ కొనుగోలు జ్యూరిచ్‌కు చాలా ముఖ్యమైన వృద్ధి మార్కెట్‌లో ప్రముఖ పాత్ర వహించడానికి మార్గం సుగమం చేసిందన్నారు.
వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు:
వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపును SBI చైర్మన్ దినేష్ కుమార్ ఖరా సమర్ధించారు. ప్రస్తుతం అన్ని బ్యాంకు శాఖల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుంచి వచ్చే వడ్డీ ఆదాయం సంవత్సరానికి రూ.40,000 దాటితే బ్యాంకులు పన్ను మినహాయించవలసి ఉంటుంది. అలాగే సేవింగ్స్ ఖాతాల విషయంలో రూ.10,000 వరకు వచ్చే వడ్డీకి పన్ను మినహాయింపు ఉంది. వడ్డీ ఆదాయంపై పన్ను పరంగా బడ్జెట్‌లో కొంత ఉపశమనం కలిగించగలిగితే.. డిపాజిటర్లకు ప్రోత్సాహకరంగా ఉంటుందని ఖరా అన్నారు.


Click it and Unblock the Notifications