Layoffs: ఆ రెండు బ్యాంకుల కలయికతో కల్లోలం.. 36,000 ఉద్యోగాలు ఫసక్..!
Layoffs: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకుంది. దీంతో అమెరికాలోని సంక్షోభం యూరప్ బ్యాంకులకూ సోకింది. ఈ క్రమంలో కుప్పకూలిన క్రెడిట్ సూయిస్ బ్యాంక్ ను కాపాడే చర్యలను అక్కడి అధికారులు చేపట్టారు.
స్విట్జర్లాండ్‌లోని రెండు అతిపెద్ద బ్యాంకులు UBS- క్రెడిట్ సూయిస్‌ల మధ్య విలీనాననికి ఇప్పటికే డీల్ పూర్తయింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం గురించిన ఆందోళనలకు ప్రతిస్పందనగా మార్చి 19న స్విస్ ప్రభుత్వం ఈ విలీనాన్ని త్వరగా ఏర్పాటు చేసింది. యునైటెడ్ స్టేట్స్‌లో అనేక బ్యాంకులు కుప్పకూలడంతో అధికారులు వేగంగా చర్యలు చేపట్టారు. అయితే ఈ డీల్ పూర్తైతే ప్రపంచవ్యాప్తంగా 36,000 మంది ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉందని తెలుస్తోంది.

రెండు కంపెనీలు కలిసిపోయిన తర్వాత మెుత్తం శ్రామికశక్తిలో 20 నుంచి 30 శాతం మందిని తొలగించనున్నట్లు అంతర్గత వర్గాల ద్వారా వెల్లడైందని స్విస్ పత్రిక SonntagsZeitung తన నివేదికలో వెల్లడించింది. మెుత్తం తొలగింపుల్లో దాదాపు 11,000 ఉద్యోగాల కోత ఒక్క స్విట్జర్లాండ్‌లోనే జరగవచ్చని నివేదిక పేర్కొంది. అయితే విలీనానికి ముందు రెండు బ్యాంకులు మెుత్తంగా 1,22,000 మంది ఉద్యోగులను కలిగి ఉన్నాయి. ప్రతిపాదిత ఉద్యోగాల కోత రెండు బ్యాంకుల సిబ్బంది సంఖ్య గణనీయంగా తగ్గుదలను సూచిస్తుంది.
UBS చైర్మన్ కోల్మ్ కెల్లెహెర్ రెండు బ్యాంకుల ఏకీకృతం చేయడం వల్ల గణనీయమైన నష్టాలు ఉన్నాయని అంగీకరించారు. గడచిన కొనన్ని సంవత్సరాలుగా క్రెడిట్ సూయిస్ సంస్థ అనేక కుంభకోణాల పరంపరలో చిక్కుకోవటం ఇన్వెస్టర్ల నమ్మకాన్ని దెబ్బతీసింది. బ్రిటీష్ ఆర్థిక సంస్థ గ్రీన్‌సిల్ దివాలా తీయడంలో బ్యాంక్ ప్రమేయం, US హెడ్జ్ ఫండ్ ఆర్కెగోస్ పతనం ఈ వివాదాల్లో అత్యంత కీలకమైనవి. అలాగే బల్గేరియన్ కొకైన్ నెట్‌వర్క్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి 2 మిలియన్ డాలర్ల జరిమానాను బ్యాంక్ ఎదుర్కొంది.


Click it and Unblock the Notifications