Swiggy Orders: దేశంలో ఫుడ్ డెలివరీ యాప్స్ వచ్చిన తర్వాత ఏది కావాలన్నా ఇంటి దగ్గరి నుంచే ప్రజలు ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నారు. స్టార్టప్ కంపెనీలు ప్రజల అవసరాలకు తగినట్లుగా కేటర్ చేస్తూ తామూ సంపాదించుకుంటున్నాయి.
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ రంజాన్ పవిత్ర మాసంలో డెలివరీల వివరాలను బుధవారం ప్రకటించింది. ఇందులోని సమాచారం ప్రకారం మార్చి 12 నుంచి ఏప్రిల్ 8 మధ్య ఏకంగా 60 లక్షల బిర్యానీ ఆర్డర్లను అందుకున్నట్లు తెలిపింది. వాస్తవానికి ఈ సంఖ్య ఇతర నెలల కంటే 15 శాతం అధికమని కంపెనీ పేర్కొంది. రంజాన్ ఆర్డర్లలో 10 లక్షల ప్లేట్ల బిర్యానీ, 5.3 లక్షల ప్లేట్ల హలీమ్‌తో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది.

హలీమ్, సమోసాలు వంటి సాంప్రదాయ వంటకాలు ఆధిపత్యం కొనసాగుతుండగా.. రంజాన్ సందర్భంగా Swiggy సాయంత్రం 5:30 నుంచి 7 గంటల మధ్య ఆర్డర్‌లలో 34 శాతం పెరిగినట్లు కంపెనీ పేర్కొంది. ఎక్కువగా ఆర్డర్ చేసిన ఆహారాల జాబితాలో చికెన్ బిర్యానీ, మటన్ హలీమ్, సమోసా, ఫలూదా, ఖీర్ ఉన్నాయి. రంజాన్ సందర్భంగా ఇతర రోజులతో పోలిస్తే దేశవ్యాప్తంగా ప్రసిద్ధ ఆహారాల ఆర్డర్‌లు పెరిగాయి. హలీమ్ 1454.88 శాతం, ఖీర్ 80.97 శాతం ఆర్డర్ల వృద్ధి నమోదైంది.
ముంబై, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, భోపాల్, మీరట్ వంటి నగరాల్లో రంజాన్ సందర్భంగా మాల్పువా, ఖర్జూరం, ఖీర్‌తో సహా స్వీట్ల ఆర్డర్‌లు భారీగా పెరిగాయి. ఇదిలా ఉండగా మరోపక్క స్విగ్గీ తన ఐపీవోను లాంచ్ చేసేందుకు సిద్ధమౌతోంది. ఏడాది చివరి నాటికి ఐపీవో ప్రారంభించవచ్చని తెలుస్తోంది. ప్రస్తుత వాల్యుయేషన్ కంటే 20 శాతం తక్కువకు షేర్లను కొనుగోలు చేసేందుకు కంపెనీ HNIలకు ఆఫర్ చేస్తోంది. రూ.80 వేల కోట్ల విలువతో రూ.350 ధరకు కంపెనీ హెచ్‌ఎన్‌ఐలకు ఆఫర్ చేస్తోంది. దీనికి ముందు ప్రత్యర్థి జొనాటో కంపెనీ ఐపీవో మూడేళ్ల కిందట జరిగిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications