గత కొంతకాలంగా నష్టాలలో కొనసాగుతున్న ఫుడ్ అండ్ గ్రోసరీ డెలివరీ సంస్థ స్విగ్గి మంగళవారం Q2 ఫలితాలలో నష్టాలూ తగ్గినట్లు నివేదించింది, ఇందుకు కారణం కొత్తగా లిస్టెడ్ అయినా కంపెనీ ఫుడ్ డెలివరీ అండ్ క్విక్ కామర్స్ సెగ్మెంట్లలో మంచి ఆర్డర్ వృద్ధిని సాధించింది. నవంబర్ 13న ట్రేడింగ్‌లోకి అడుగుపెట్టిన స్విగ్గి సెప్టెంబర్ 30తో ముగిసిన మూడు నెలల కాలానికి రెండవ త్రైమాసికంలో నష్టం 6.26 బిలియన్లుగా ఉంది అంతకుముందు 6.57 బిలియన్లుగా ఉంది. అయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో రిపోర్ట్ చేసిన రూ.611 కోట్ల కంటే నష్టం కాస్త ఎక్కువగానే ఉంది.
స్విగ్గికి పోటీగా ఉన్న జొమాటో ఫుడ్ డెలివరీ వ్యాపారంతో పాటు క్విక్ కామర్స్ లోకి మారడం ఈ మార్కెట్లో గట్టి పోటీని ఇస్తుంది. అలాగే పాలు నుండి ఎలక్ట్రానిక్స్ వరకు ప్రతిది పదిహేను నిమిషాల్లో డెలివరీ అందిస్తుంది.

Swiggy మొత్తం గ్రాస్ ఆర్డర్ వాల్యూ (GOV) 30 % YoY వృద్ధి రూ.11,306 కోట్లకు చేరుకుంది, అయితే EBITDA నష్టం రూ.341 కోట్లుగా ఉంది, ఈ లెక్కలు సంవత్సరానికి 30% నష్టాన్ని తగ్గించింది. స్విగ్గి యావరేజ్ ప్రతినెలా యూజర్స్ (MTU) 19.2% YoY 17.1 మిలియన్లకు పెరిగింది. కంపెనీ కొత్తగా 'బోల్ట్' అనే 10 నిమిషాల రెస్టారెంట్ ఫుడ్ డెలివరీ సర్వీస్‌ను ప్రారంభించింది, ఇది లాంచ్ చేసిన 8 వారాలలో ఇప్పటికి మొత్తం ఫుడ్ డెలివరీలలో 5% వాటా ఉంది.
"మా ఫుడ్ బిజినెస్ ఆపరేషన్ అద్భుతమైన పర్ఫార్మెన్ బలమైన ఆవిష్కరణ ఇంకా అమలు నేపథ్యంలో వస్తుంది. ఇంకా కస్టమర్ల అనుభవాన్ని అంచనా వేయడానికి, మెరుగుపర్చడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నాము. తాజాగా ప్రవేశపెట్టిన బోల్ట్- అవర్ 10-మినిట్స్ డెలివరీ సర్వీస్ అందుకు ఉదాహరణ, ఇన్‌స్టామార్ట్ నేడు 54 నగరాలకి విస్తరించి, 32 మిలియన్ల కంటే ఎక్కువ ప్రత్యేకమైన వస్తువులను డెలివరీ చేస్తుంది, ఆవరేజ్ డెలివరీ టైం 13 నిమిషాలు"అని స్విగ్గీ MD & గ్రూప్ CEO శ్రీహర్ష మెజెటీ చెప్పారు.
Q2 రిజల్ట్స్ ముందు ఇంట్రాడే ట్రేడ్‌లో స్విగ్గి షేర్లు 9.4% పెరిగి రూ.542.10తో కొత్త గరిష్టాన్ని తాకాయి. అయితే, స్టాక్ 1.2% పడిపోయి రూ.489.20 వద్ద స్థిరపడింది. అయితే మార్కెట్ క్యాపిటలైజేషన్ రోజు ట్రేడ్ ముగిసే సమయానికి రూ.1.09 లక్షల కోట్లుగా ఉంది. ప్రస్తుత స్థాయిలో స్విగ్గి షేర్లు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ ధర రూ.390 కంటే 25.4% ప్రీమియంతో ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications