Jio, Swiggy: జియో రీఛార్జ్ తో స్విగ్గీ వన్ లైట్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం!
టెలికామ్ దిగ్గజం రిలయన్స్ జియో(Jio) కొత్త రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఆన్ లైన్ ఫుడ్ డెలవరీ యాప్ వాడేవారిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్లాన్ ను ప్రకటించింది. ఈ ప్లాన్ ప్రకారం టెలికాం కంపెనీ ఫుడ్ డెలివరీ సబ్‌స్క్రిప్షన్‌ను అందజేయనుంది. రూ.866 రీఛార్జ్ చేసుకుంటే మూడు నెలలకు రూ.99 గల స్విగ్గీ వన్ లైట్(Swiggy One lite) సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తోంది. టెల్కో ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా వినియోగదారులకు స్విగ్గీ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభించడం ఇదే మొదటిసారి అని కంపెనీ పేర్కొంది. ఇటీవల ప్రారంభించిన Swiggy One Lite సబ్‌స్క్రిప్షన్ ధర మూడు నెలలకు రూ.99 గా ఉంది.
రిలయన్స్ జియో రూ.866 ప్లాన్ లో అపరిమిత కాలింగ్ సౌకర్యంతో రోజుకు 2GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ సబ్‌స్క్రైబర్‌లకు అపరిమిత 5G డేటాను అందిస్తుంది. 84 రోజుల పాటు చెల్లుబాటు అయ్యే ఈ ప్లాన్ మూడు నెలల Swiggy One Lite సబ్‌స్క్రిప్షన్, JioSuite యాప్‌లకు కాంప్లిమెంటరీ యాక్సెస్‌ని కూడా అందిస్తుంది.

Swiggy One Lite సబ్‌స్క్రిప్షన్ తో వినియోగదారులు అదనపు ప్రయోజనాలు పొందవచ్చు. రూ.149 కంటే ఎక్కువ ఆహార ఆర్డర్‌లపై 10 ఉచిత హోమ్ డెలివరీ ఉంటుంది. రూ.199 కంటే ఎక్కువ ఇన్‌స్టామార్ట్ ఆర్డర్‌లపై 10 ఉచిత హోమ్ డెలివరీలు ఉంటాయి. ఆహారం, ఇన్‌స్టామార్ట్ ఆర్డర్‌లపై సర్జ్ ఫీజు ఉండదు. సాధారణ ఆఫర్‌ల కంటే 20K+ ఫుడ్ డెలివరీ రెస్టారెంట్‌లపై 30% వరకు అదనపు తగ్గింపులు ఉంటాయి.
రూ.60 కంటే ఎక్కువ జెనీ డెలివరీలపై 10% తగ్గింపు లభిస్తుంది. ఈ పండుగ సీజన్‌లో భాగంగా కంపెనీ రూ. 866 రీఛార్జ్‌పై రూ. 50 క్యాష్‌బ్యాక్ ఇస్తోందని టెల్కో ప్రకటించింది. క్యాష్‌బ్యాక్ వినియోగదారు MyJio ఖాతాలో క్రెడిట్ అవుతుందని పేర్కొంది. దాదాపు 40 కోట్ల సబ్‌స్క్రైబర్లు ఉన్న జియో.. ఎప్పటికప్పుడు యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications