బిర్యానీ నుండి బర్గర్ వరకు ఉచిత డెలివరీ.. రూ.99 స్టోర్‌ను ప్రారంభించిన స్విగ్గీ

భారతదేశంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సర్వీస్ కంపెనీలైన స్విగ్గీ, జొమాటోల మధ్య తీవ్ర పోటీ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ పోటీని మరింత పెంచడానికి స్విగ్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ కస్టమర్ల కోసం రూ.99కి ఉచిత డెలివరీతో కూడిన ఫుడ్ డెలివరీ సర్వీస్‌ను ప్రవేశపెట్టింది. బడ్జెట్ పై అవగాహన ఉన్న, సామాన్య కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని Swiggy రూ.99 స్టోర్ అనే కొత్త ఆప్షన్‌ను తాజాగా ప్రారంభించింది. విద్యార్థులు, మొదటిసారి ఉద్యోగార్థులతో పాటు సామాన్యులుచ బడ్జెట్ పై అవగాహన ఉన్న కస్టమర్లు ఇక నుంచి రూ.99 లోపు ఆహారాన్ని ఆర్డర్ చేసి ఉచిత డెలివరీ ద్వారా పొందవచ్చు.

స్విగ్గీ తన రూ.99 స్టోర్ డెలివరీ సేవను 175 కి పైగా భారతీయ నగరాల్లో ప్రారంభించినట్లు ప్రకటించింది.స్విగ్గీ వినియోగదారులు ఇకపై బర్గర్లు, బిర్యానీ, చపాతీలు వంటి ఆహార పదార్థాలను రూ.99 లోపు ఫ్రీ డెలివరీ ద్వారా కొనుగోలు చేయవచ్చు. డెలివరీ అనంతరం ఎటువంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని స్విగ్గీ CEO రోహిత్ కపూర్ అన్నారు.

Swiggy Rs 99 store Swiggy budget meals Swiggy affordable food Swiggy 99 meals budget food delivery India Swiggy low cost meals Swiggy new feature 2025 Swiggy Rs 99 menu cities cheap food online Swiggy food offers 2025 99 99 99 2025 175 99 99

వివిధ నగరాల్లోని రెస్టారెంట్లతో చర్చలు జరిపి తక్కువ ధరకు ఆహారాన్ని డెలివరీ చేయడానికి వినియోగదారులకు వీలుగా ఈ సౌకర్యాన్ని ప్రవేశపెట్టామని ఆయన తెలిపారు. ఏ రకమైన ఆహారాన్ని ఎక్కువగా కొనుగోలు చేశారు, ఏ దుకాణం నుండి ఎక్కువ ఆహారం అందింది వంటి సమాచారాన్ని చూపించడానికి ఈ ఫ్రీ డెలివరీ సేవను ప్రవేశపెట్టామని స్విగ్గీ CEO అన్నారు.

కస్టమర్ ఈ ఫీచర్ పొందేందుకు స్విగ్గీ యాప్‌లోకి వెళ్లి రూ.99 స్టోర్‌పై క్లిక్ చేసి వెంటనే ఆర్డర్ చేసేలా తయారు చేశామని చెప్పారు. కస్టమర్‌లో ప్రతిరోజూ రూ.99 లోపు భోజనం లేదా రాత్రి భోజనం ముగించవచ్చనే అభిప్రాయం తీసుకురావడానికి ఈ ఆలోచనను తీసుకువచ్చారు. కాగా డెలివరీ ఛార్జీలను చూసి చాలా మంది కస్టమర్లు రాత్రి వేళ తమ ఆర్డర్‌ను రద్దు చేసుకుంటున్నందున స్విగ్గీ ఒక కొత్త సేవతో ముందుకు వచ్చింది. ఈ రూ. 99 స్టోర్ నుండి ఆర్డర్ చేసిన ఆహారాన్ని ఎకో సేవర్ మోడ్‌లో డెలివరీ చేస్తామని స్విగ్గీ ప్రకటించింది.

ఇదిలా ఉంటే ఇండియాలో ఫుడ్ డెలివరీ రంగం గత కొన్ని త్రైమాసికాలుగా వృద్ధిలో మందగమనాన్ని చవిచూస్తోంది. ఆర్డర్ల సంఖ్య తగ్గుతున్నా, వినియోగదారుల ఖర్చు నియంత్రిత స్థాయిలో ఉండటంతో కంపెనీలు కొత్త మార్గాలు అన్వేషిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాపిడో ఇప్పుడు ఫుడ్ డెలివరీ రంగంలోకి ప్రవేశించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దీంతో స్విగ్గీ కూడా కస్టమర్లను ఆకర్షించేందుకు తాజా నిర్ణయం తీసుకుంది. రూ.99 ద్వారా మార్కెట్లో దూసుకువెళ్లేందుకు కసరత్తు ప్రారంభించింది. మరి ఈ కొత్త సేవ ద్వారా కస్టమర్లను ఆకట్టుకుంటుందా...మిగతా ఫుడ్ డెలివరీ సంస్థలకు షాక్ ఇస్తుందా లేదా అన్నది చూడాలి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+