ఈ రోజుల్లో ఫుడ్ డెలివరీ యాప్స్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంటుంది. దీంతో ఆ కంపెనీలు కార్యకలాపాల్లో ఎలాంటి మార్పులు తీసుకురావచ్చన్న ఆలోచనలు ప్రారంభించాయి. దీనికి సంబంధించి తాజగా ఫుడ్ అండ్ గ్రోసరీ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గి "స్నాక్ (SNACC)" అనే కొత్త అప్లికేషన్‌ను విడుదల చేసింది. మీరు కేవలం 15 నిమిషాల్లో స్నాక్స్, డ్రింక్స్ మొదలైనవాటిని ఆర్డర్ చేసి డెలివరీ పొందవచ్చు.
ఇప్పటి వరకు Swiggy ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్, హైపర్‌లోకల్ డెలివరీ, డైనింగ్ అవుట్ మొదలైన వాటి కోసం ఒకే యాప్‌ను ఉపయోగించింది. Blinkit Bistro యాప్ నుండి zepto's Cafe ఇంకా Swish యాప్ వరకు అన్ని ప్రముఖ ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు వాటి యాప్‌లను డబుల్ చేస్తున్నాయి. ఇలా చేయడం ద్వారా కస్టమర్లు ఎం కోరుకుంటారో దాని కోసం వేగంగా డెలివరీ పొందవచ్చు.

ఎందుకంటే చాలా మంది కస్టమర్లు త్వరగా ఫుడ్ ఆర్డర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. Blinkit అండ్ zepto వంటి జొమాటో యాజమాన్యంలోని ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు ఫుడ్ డెలివరీ కోసం ప్రత్యేక యాప్‌లను అలాగే కస్టమర్‌లను ఆఫర్‌లతో ఆకర్షించడానికి కొత్త అప్లికేషన్‌లను ప్రవేశపెట్టాయి.
తాజాగా లాంచ్ చేసిన స్నాక్ అప్లికేషన్ లైట్ ఆకుపచ్చ బ్యాక్ గ్రౌండ్ డార్క్ టెక్స్ట్ తో ఉంటుంది. ఈ అప్లికేషన్ జనవరి 7 నుండి అందుబాటులో ఉంటుంది. అది కూడా ఈ ఫెసిలిటీ ప్రస్తుతం బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. త్వరలోనే Swiggy ఇతర ప్రాంతాలకు కూడా ఈ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకొస్తుందని తెలిసిన వర్గాలు చెబుతున్నాయి.
ఈ స్నాక్ అప్లికేషన్ లో భారతీయ బ్రేక్ ఫాస్ట్, కాఫీ, బేకరీ వస్తువులు, శీతల పానీయాలు, గుడ్లు ఇంకా ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను చూపిస్తుంది. కొంతకాలం క్రితం స్విగ్గీ బోల్ట్ అనే అప్లికేషన్‌ను లాంచ్ చేసింది. బోల్డ్ అనేది Swiggy క్విక్ ఫుడ్ డెలివరీ విభాగం. సెలెక్ట్ చేసిన రెస్టారెంట్‌లు నిర్ణీత సమయంలో ఆర్డర్‌లను డెలివరీ చేయాలి. అలంటి రెస్టారెంట్లు మాత్రమే బోల్డ్ అప్లికేషన్‌లో లిస్ట్ చేసి ఉంటాయి.
Swiggy ద్వారా 15 నిమిషాల ఫుడ్ డెలివరీ యాప్ స్నాక్-ఇన్ లాంచ్ ఫాస్ట్ ఫుడ్ డెలివరీ పరిశ్రమలో కొత్త పోటీని సృష్టించింది. మారుతున్న కస్టమర్ల అవసరాలను తీర్చేందుకు ఫుడ్ డెలివరీ పరిశ్రమలోని కంపెనీలు కొత్త సేవలను ప్రవేశపెడుతున్నాయి. స్నాక్ వంటి యాప్‌లు కస్టమర్ల లైఫ్ స్టయిల్ ఈజీ అండ్ స్మూత్ చేస్తాయి ఇంకా వేగంగా అలాగే సౌకర్యవంతమైన ఫుడ్ డెలివరీ అందిస్తాయి.


Click it and Unblock the Notifications