బెంగళూరులో స్విగ్గీ కొత్త సంచలనం: హెల్త్ ఫ్రీక్స్ కోసం 'ఈట్‌రైట్' స్పెషల్ మెనూ!

సిటీ లైఫ్‌లో బిజీగా ఉండే ఐటీ ఉద్యోగులకు, అర్బన్ కస్టమర్లకు ఆఫీస్ టైమ్‌లో టైమ్‌కి తినడమే ఒక పెద్ద టాస్క్. ఇక అందులోనూ హెల్తీ ఫుడ్ తినడం అంటే ఇంకా కష్టం. రోజువారీ జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటూ, డైట్ ఫాలో అవ్వాలనుకునే వారి కోసం ప్రముఖ ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ (Swiggy) ఒక సరికొత్త గుడ్ న్యూస్ చెప్పింది. బెంగళూరు సిటీ కోసం మాత్రమే ప్రత్యేకంగా 'ఈట్‌రైట్' (EatRight) రేంజ్‌ను సరికొత్త క్యూరేటెడ్ మెనూతో పరిచయం చేసింది.

Swiggy EatRight Bengaluru Goodness To Go Healthy Food Delivery Impresario Menu News

సిటీలోకి 'గుడ్‌నెస్ టు గో' ఎంట్రీ!

ప్రముఖ రెస్టారెంట్ ఆపరేటర్ 'ఇంప్రెసారియో ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ హాస్పిటాలిటీ' సంస్థ.. కేవలం ఆన్‌లైన్ డెలివరీ కోసమే 'గుడ్‌నెస్ టు గో' (Goodness To Go) అనే సరికొత్త బ్రాండ్‌ను లాంచ్ చేసింది. ఇప్పటికే ఢిల్లీ, గురుగ్రామ్‌లలో సక్సెస్ అయిన ఈ బ్రాండ్.. ఇప్పుడు బెంగళూరు (Bengaluru) లోని కస్టమర్ల టేస్ట్‌కు తగ్గట్టుగా స్విగ్గీ వేదికగా అడుగుపెట్టింది. నిత్యం పరుగుల లంకలో ఉండే సిటీ జనాలు.. ఫ్రెష్, కన్వీనియంట్ , హెల్తీగా ఉండే రోజువారీ భోజనం కోసం చూస్తున్నారు. వారి కోసమే ఈ సరికొత్త మెనూ డిజైన్ చేశారు.

మెనూలో ఏమేం స్పెషల్స్ ఉన్నాయి?

ఈ బ్రాండ్ మెనూ అంతా ప్రధానంగా మూడు కేటగిరీల చుట్టూ తిరుగుతుంది. అవేంటంటే - సలాడ్లు (Salads), సూప్‌లు (Soups) , పోక్ బౌల్స్ (Poke Bowls). ఆఫీసుల్లో వర్క్‌డే లంచ్‌లకైనా, రాత్రి డిన్నర్లకైనా లేదా ఇంట్లో హ్యాపీగా తింటూ ఎంజాయ్ చేయడానికైనా ఇవి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి.

ఇందులో ఉండే కొన్ని క్రేజీ ఆప్షన్స్ చూస్తే..

  • మెడిటరేనియన్ ఫలాఫెల్ సలాడ్
  • క్వినోవా & స్ప్రౌట్ సలాడ్
  • టొమాటో బాసిల్ సూప్
  • ట్రఫుల్ మష్రూమ్ సూప్
  • చికెన్ ఫెన్నెల్ సూప్

ఇంప్రెసారియో గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ శంసుల్ వాహిద్ మాట్లాడుతూ.. ఈ మెనూను కేవలం హెల్త్ మాత్రమే కాదు, టేస్ట్‌ను కూడా బ్యాలెన్స్ చేస్తూ రోజువారీ తినేలా చాలా జాగ్రత్తగా డెవలప్ చేశామని చెప్పారు. ఆర్డర్ చేసిన తర్వాత కస్టమర్ల దగ్గరకు వెళ్లేసరికి ఫుడ్ ఏమాత్రం పాడవకుండా, ఫ్రెష్‌గా ఉండేలా ప్యాకింగ్ డిజైన్ చేశారు.

ట్రెండ్‌కు తగ్గట్టుగా అడుగులు

ఇలాంటి డెలివరీ-ఫస్ట్ ఫార్మాట్‌లకు ప్రస్తుతం మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఎందుకంటే ప్రజలు తాము తినే ఆహారం పట్ల చాలా కాన్షియస్‌గా ఉంటున్నారు. "ప్రజలు తాము తినే ఆహారం బాగుండాలి అనుకుంటున్నారు, అదే సమయంలో అది ఎగ్జైటింగ్‌గా, సౌకర్యవంతంగా , కడుపు నింపేలా ఉండాలి" అని కంపెనీ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ దివ్య అగర్వాల్ తెలిపారు.

2001లో ప్రారంభమైన ఇంప్రెసారియో గ్రూప్‌కు దేశవ్యాప్తంగా 20కి పైగా నగరాల్లో 60 కంటే ఎక్కువ రెస్టారెంట్లు ఉన్నాయి. మనకు బాగా తెలిసిన SOCIAL, స్మోక్ హౌస్ డెలి, మోచా , యాంటీసోషల్ వంటి పాపులర్ బ్రాండ్స్ అన్నీ వీరివే. ఇప్పుడు బెంగళూరు (Bengaluru) లో లాంచ్ చేసిన ఈ కొత్త హెల్తీ ఫుడ్ సిరీస్ ఇన్స్టంట్ హిట్‌గా మారుతుందని మేనేజ్‌మెంట్ గట్టి నమ్మకంతో ఉంది. సో.. బెంగళూరు డైట్ లవర్స్, ఇంకెందుకు ఆలస్యం.. ఇప్పుడే స్విగ్గీ ఓపెన్ చేసి మీ హెల్తీ బౌల్‌ని ఆర్డర్ చేసేయండి!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+