Swiggy: నిజాన్ని బద్దలు కొట్టిన స్విగ్గీ డెలివరీ ఏజెంట్.. సోషల్ మీడియాలో వైరల్.. ప్రశంసల వర్షం..
Swiggy: ఇటీవల స్విగ్గీ, జొమాటో ఉద్యోగుల గురించి మనం చాలా వార్తలను చదువుతూనే ఉన్నాము. కొన్ని చోట్ల మంచి పనులు జరిగాయి. కొన్నిచోట్ల హింసాత్మక ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. దీనికి సంబంధించి ఢిల్లీ యూనివర్సిటీలో లా విద్యార్థి అనురాగ్ భార్గవ తన లింక్డ్‌ఇన్ పేజీలో కొన్ని విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఇది చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. కాలేజీలో చదువుతున్న రోజుల్లో తాను స్విగ్గీలో పార్ట్‌టైమ్ డెలివరీ ఏజెంట్‌గా పనిచేసినట్లు అతడు వెల్లడించాడు.

ఎన్నో వివాదాలు..
ఒక వైపు 10 నిమిషాల డెలివరీ గురించి వివాదం డెలివరీ సిబ్బంది భద్రతపై భయాలను కూడా పెంచింది. దీంతో ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందని పలు ప్రశ్నలు సంధించారు. కొన్ని చోట్ల డెలివరీ భాగస్వాముల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనురాగ్ చేసిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది.

చదువుకునేందుకు ఖర్చుల కోసం..
అనురాగ్ తన చదువుకు అవసరమైన ఖర్చులను భరించేందుకు డెలివరీ పార్టనర్‌గా పార్ట్‌టైమ్ పనిచేస్తున్నట్లు తెలిపాడు. ఈ పని చేస్తున్నందుకు జనం జాలిగా చూస్తున్నారని అన్నాడు. కానీ.. ఈ డెలివరీ భాగస్వాములు వారియర్స్ అని అతడు వెల్లడించాడు. తాను వారికి నమస్కరిస్తానని అనురాగ్ చెప్పారు. ఈ ఉద్యోగం మిమ్మల్ని వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా చేస్తుందని అతడు అభిప్రాయపడ్డాడు.

పనికి తగ్గ ఆదాయం..
స్విగ్గీలో పార్ట్ టైమ్ పని వల్ల డబ్బు సంపాదించడం సులభతరంగా ఉండటంతో పాటు పని సౌకర్యవంతమైనదని వెల్లడించాడు. దానికి తగిన ఆదాయం వస్తుందని, దీని ద్వారా చదువుపై దృష్టి సారించినట్లు అనురాగ్ చెప్పాడు. వ్యక్తిత్వాన్ని పొందండి. డబ్బు పొందండి. మీ సౌలభ్యం ప్రకారం మీరు దీన్ని ఒకేసారి చేయవచ్చని అతను పేర్కొన్నాడు.

మంచి జీవితం
తాను తల్లితో జీవితాన్ని చక్కగా గడుపుతున్నట్లు తెలిపాడు. ఇంతవరకు తాను కస్టమర్స్ వైపు నుంచి ఎలాంటి అసభ్య ప్రవర్తనను చూడలేదని, అలాంటి పరిస్థితులు తనకు ఎప్పుడూ ఎదురుకాలేదని స్పష్టం చేశాడు. ఈ ఉద్యోగానికి అపారమైన క్రమశిక్షణ, శ్రద్ధ అవసరమని అన్నాడు. ఆహారాన్ని జాగ్రత్తగా, సమయానికి చేర్చితే చాలని అంటున్నాడు.

ఉద్యోగం ఏమి నేర్పిందంటే..
ఈ ఉద్యోగం తనకు సహనం, క్రమశిక్షణ, ఇతరుల పట్ల గౌరవం, పొదుపు, సాహసం, మూర్ఖత్వం నేర్పిందని కూడా అనురాగ్ చెప్పాడు. ఈరోజు తనలో ఒక మనిషిని చూస్తున్నానని, తనకు చేతనైనంతలో ఇతరులకు సహాయం చేయాలనుకుంటున్నట్లు వెల్లడించాడు.

ఈ పోస్ట్ ఎందుకు పెట్టాడంటే..?
సమాజంలోని హైక్లాస్ ప్రజలకు ఈ ఉద్యోగం విలువ తెలుసని అనురాగ్ అంటున్నాడు. కానీ.. ఢిల్లీలో చాలా మంది నన్ను జాలిగా చూస్తారు. అయినప్పటికీ.. ఈ ఉద్యోగం ఒక వ్యక్తిగా నన్ను మార్చేసిందని తన పోస్టులో వెల్లడించాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. దీనికి అనేక మంది నుంచి విశేష స్పందన లభిస్తోంది. అనేక మంది అతని దృక్కోణాన్ని, పని పట్ల గౌరవాన్ని ప్రశంశిస్తున్నారు. అనురాగ్ పోస్ట్‌ను వేలాది మంది లైక్ చేశారు.


Click it and Unblock the Notifications