Viral Video: భారీ వర్షంలోనూ విధుల్లో స్విగ్గీ ఏజెంట్.. తడిచి ముద్దవుతూ.. హృదయాన్ని కదిలించే వీడియో ..

Swiggy Viral Video: ఈ రోజుల్లో Zomato, Swiggy వంటి ఫుడ్ డెలివరీ కంపెనీల్లో పని చేస్తున్న ఉద్యోగులు వాతావరణంతో సంబంధం లేకుండా విధులు నిర్వహిస్తుంటారు. అది వారి నిబద్ధతకు, జీవించేందుకు వారు చేస్తున్న పోరాటానికి నిదర్శనం. కస్టమర్లకు సమయానికి వేడివేడిగా ఆహారాన్ని అందించేందుకు రోజులో 24 గంటలూ పని చేస్తున్నారు. వాతావరణం కఠినంగా ఉన్నప్పుడు డెలివరీ ఏజెంట్లకు మరింత కష్టంగా ఉంటుంది. ఇటీవల ఒక స్విగ్గీ డెలివరీ భాగస్వామి భారీ వర్షంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వేచి ఉంటున్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

తడిచి ముద్దైనప్పటికీ..

తడిచి ముద్దైనప్పటికీ..

పూర్తిగా తడిసిపోయి, రెయిన్‌కోట్ లేకుండా తన డెలివరీని పూర్తి చేసేందుకు వెళుతూ.. అతను తన ఫోన్‌ని మళ్లీ మళ్లీ చూస్తున్న వీడియోను మనం గమనించవచ్చు. బహుశా ఆర్డర్ స్థితిని తనిఖీ చేయడానికి లేదా అతను డెలివరీకి ఆలస్యమవుతుంటే లేదా టైమ్ చెక్ చేసుకునేందుకు వర్షంలో ఫోన్ చూస్తున్నాడు.

నెట్టింట్లో వైరల్..

ప్రస్తుతం స్విగ్గీ డెలివరీ ఏజెంట్ కు సంబంధించిన ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్ యూజర్ డిన్నెస్ కొమ్మా అనే యూజర్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇప్పటి వరకు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్‌గా పోస్ట్ చేసిన వీడియోకు దాదాపు పది లక్షల లైక్‌లు వచ్చాయి.

కామెంట్ల ప్రశంసలు..

కామెంట్ల ప్రశంసలు..

"కఠినమైన ఉద్యోగి జీవితం అందరికీ సులభం కాదు" అంటూ యూజర్ ఈ వీడియోకు ట్యాగ్ పెట్టాడు. చాలా మంది వినియోగదారులు తమ ఉద్యోగులకు కనీసం రెయిన్ కోట్‌లను అందించాలని ఫుడ్ డెలివరీ కంపెనీలకు సూచించారు. దీనిద్వారా కస్టమర్లకు ఆహారాన్ని సురక్షితంగా డెలివరీ చేయవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. ఒక యూజర్ తాను రెయిన్ కోట్ ఇవ్వాలనుకుంటున్నానని వీడియోలోని వ్యక్తి మీకు తెలుసా అంటూ కామెంట్ చేశాడు. మరికొందరు ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు తమ జీవితంలో మనుగడకోసం ఎదుర్కొన్న గడ్డు పరిస్థితుల గురించిన అనుభవాలను పంచుకున్నారు. .

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+