Swiggy News: పనిమీద హైదరాబాద్ లాంటి కొత్త నగరానికి వచ్చిన వ్యక్తి కి స్విగ్గీ ఏజెంట్ పెద్ద మనస్సుతో చేసిన పని నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటికీ మనచుట్టూ మంచి వ్యక్తులు ఉన్నారు అనటానికి ఇదొక నిదర్శనంగా నిలుస్తోంది.
వాస్తవానికి స్విగ్గీ డెలివరీ ఏజెంట్ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక డెలివరీని అందించటం కోసం తెల్లవారుజామున 3 గంటలకు అతడు చేసిన ప్రయత్నం చాలా మంది మనస్సులను గెలుచుకుంది. అంకితభావంతో ఫుడ్ ఆర్డర్ డెలివరీ చేసేందుకు దాదాపు 12 కిలోమీటర్లు కొనసాగిన అతని ప్రయాణం ఒక వ్యక్తి ఆకలిని నివారించింది.

తమల్ సాహా అనే వ్యక్తి ఒక పనిమీద హైదరాబాద్ నగరానికి వచ్చాడు. పని ముగించుకుని రాత్రి ఆలస్యంగా హోటల్‌కి తిరిగి వచ్చాడు. తన దగ్గరిలోని రెస్టారెంట్లన్నీ మూసివేసి ఉన్నట్లు గమనించి.. ఆకలితో స్విగ్గీలో ఆర్డర్ పెట్టాడు. అయితే పొరపాటున డెలివరీ అడ్రస్ తప్పుగా ఎంచుకున్నాడు. దీంతో డెలివరీ ఏజెంట్ దాదాపు 12 కిలోమీటర్లు అదనంగా బండి నడుపుకుంటూ వచ్చి తనకు ఆహారాన్ని అందించాడని తమల్ సాహో ట్విట్టర్ లో వెల్లడించాడు. అప్పుడు సమయం తెల్లవారుజామున 3 గంటలు అయ్యిందని పేర్కొన్నాడు.
స్విగ్గీ డెలివరీ ఏజెంట్ తన పేరును మహమ్మద్ ఆజం అని వెల్లడించాడు. ఉదయం నుంచి తాను ఏమీ తినలేదని ఆజం చెప్పినట్లు సాహా తన పోస్టులో పేర్కొన్నాడు. ఆజం నిజాయితీ వల్ల మానవత్వంపై తనకు నమ్మకం పెరిగిందని సాహా చెప్పారు. నేటికీ ప్రపంచంలో మంచి వ్యక్తులు ఉన్నారని నేను భావిస్తున్నాను. ఆజం నా హృదయాన్ని గెలుచుకున్నాడు అని రాశాడు. ఇదే క్రమంలో తనతో కలిసి డిన్నర్ చేయమని స్విగ్గీ ఏజెంట్ మహమ్మద్ ఆజంను సాహా ఆహ్వానించాడు. అయితే దానిని సదరు ఏజెంట్ నిరాకరించాడు.
ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక అపరిచితుడు చేసిన చిన్న ప్రయత్నం మానవత్వం తగ్గిపోయిందని, కానీ అది ఇప్పటికీ సజీవంగా ఉందని నమ్మడానికి మాకు స్ఫూర్తినిస్తుందని ఒక వినియోగదారు రాశారు. ఈ అనుభవాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు అని మరొక వినియోగదారు రాశారు.


Click it and Unblock the Notifications