Hyderabad Biryani: ఎన్ని వ్యాపారాలు ఉన్నా ఫుడ్ బిజినెస్ దారే వేరు. ప్రతిదానికి సీజన్, అన్ సీజన్ ఉంటాయేమో కానీ హోటల్స్ మరియు రెస్టారెంట్లకు మాత్రం అటువంటివి డిక్షనరీలోనే ఉండవు. అయితే ప్రాంతాన్నిబట్టి ఒక్కో పదార్థానికి ప్రత్యేకత ఉంటుంది. అలా తెలుగు రాష్ట్రం తెలంగాణలో హైదరాబాద్ బిర్యాని కి ఉన్న పేరు ప్రఖ్యాతల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏటా వేలకోట్ల వ్యాపారం ఈ ఒక్క ఐటమ్ పేరిటే జరుగుతుండటం విశేషం.
దేశంలో బిర్యానీ ఆర్డర్లలో భాగ్యనగరం అగ్రస్థానంలో కొనసాగుతోంది. గత 12 నెలల్లో 13 మిలియన్లకు పైగా ఆర్డర్లతో రికార్డు సృష్టించింది. ఈ మేరకు ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ స్విగ్గీ తన డేటా ఆధారంగా ఓ నివేదిక విడుదల చేసింది. దేశంలో హైదరాబాద్ బిర్యానీ క్యాపిటల్‌గా కొనసాగుతున్నట్లు అందులో పేర్కొంది. ఈ భారీ డిమాండ్ ను తీర్చేందుకు మార్చి 15 నుంచి 17 వరకు ప్రత్యేకంగా బిర్యానీ ఫెస్టివ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.

ఎందుకంటే స్విగ్గీ డేటా ప్రకారం.. దేశంలోని ప్రతి 5 బిర్యాని ఆర్డర్లలో ఒకటి హైదరాబాద్ నుంచే వస్తుంది. అంతేకాకుండా ఇండియాలో అత్యధికంగా ఆర్డర్ చేసిన వంటకం కూడా బిర్యానీయే. 2023లో సగటున సెకనుకు 2.5 బిర్యానీలు హైదరాబాద్‌లో ప్రజలు ఆర్డర్ చేశారు. ఈ ప్రత్యేకతకు గుర్తుగా తమ బిర్యానీ ఫెస్ట్‌లో ఆ వంటకంపై 60 శాతం తగ్గింపు ఇస్తున్నట్లు స్విగ్గీ ప్రకటించింది. ఇందులో 1,700 రెస్టారెంట్లు ఇందులో భాగమైనట్లు స్పష్టం చేసింది.
ఏడాదిపాటు డేటాను గమనిస్తే బిర్యానీల్లో ఎక్కువగా చికెన్ బిర్యానీ కోసం ఆర్డర్లు చేసినట్లు తెలుస్తోంది. దాని తర్వాత స్థానంలో వెజ్ బిర్యానీ, అనంతరం చికెన్ దమ్ మరియు మటన్ బిర్యానీలు ఉన్నాయి. 2023లో స్విగ్గి రోజుకు 21 వేల బిర్యానీలను హైదరాబాద్‌లో డెలివరీ చేసింది. దీన్నిబట్టి భాగ్యనగర వాసులకు ఈ ఈ వంటకంపై ఉన్న ప్రేమ ఎంతో అర్థం చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications