Swiggy: స్విగ్గీ గూటికి లింక్ లాజిస్టిక్స్.. ఇక రిటైల్ డిస్ట్రిబ్యూషన్ విభాగంలో చెడుగుడే..
Swiggy: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థగా స్విగ్గీ మనందరికీ పరిచయమే. ఇటీవలే ఇన్‌స్టా మార్ట్ పేరుతో మరో అడుగు ముందుకేసింది. తద్వారా ఈ విభాగంలో అధిక శాతం మార్కెట్ షేర్ పొందడానికి ప్లాన్ చేసింది. తాజాగా మరో రిటైల్ లాజిస్టిక్స్ కంపెనీని సైతం కొనుగోలు చేసింది.
దేశంలోని భారీ రిటైల్ మార్కెట్లోకి ఫుడ్ అగ్రిగేటర్ స్విగ్గీ ప్రవేశించనుంది. ఇందుకోసం రిటైల్ లాజిస్టిక్స్ కంపెనీ లింక్(Lynk) లాజిస్టిక్స్ లిమిటెడ్‌ను కైవసం చేసుకుంది. అయితే ఎంత మొత్తానికి కొనుగోలు చేసిందో మాత్రం వెల్లడించలేదు. సహ వ్యవస్థాపకులు, CEO శేఖర్ భేండే నేతృత్వంలో లింక్ స్వతంత్ర కంపెనీగానే కొనసాగుతుందని స్విగ్గీ ఓ ప్రకటనలో తెలిపింది.

"బ్రాండ్-ఫస్ట్, టెక్-లీడ్ ఆపరేటింగ్ మోడల్‌తో రిటైల్ లాజిస్టిక్స్ విభాగంలో లింక్ ప్రత్యేక స్థానం సాధించింది. పలు FMCG బ్రాండ్‌లతో విజయవంతంగా దూసుకుపోతోంది" అని స్విగ్గీ CEO శ్రీహర్ష మెజెటీ వెల్లడించారు. సప్లై చైన్, లాజిస్టిక్స్ లో మా అనుభవంతో లింక్ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి దిశగా నడిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తద్వారా రిటైల్ కస్టమర్లు కూడా మెరుగైన సేవలు అందుకునే అవకాశం లభిస్తుందన్నారు.
అభినవ్ రాజా, భేండే కలిసి 2015లో లింక్ ను స్థాపించారు. ఇది దేశంలోని అతిపెద్ద టెక్నాలజీ ఆధారిత FMCG రిటైల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలలో ఒకటిగా గుర్తింపు పొందింది. టాప్ 8 నగరాల్లో లక్ష కంటే ఎక్కువ రిటైల్ స్టోర్‌ల నెట్‌వర్క్ దీని సొంతం. మంచి YoY లాభదాయకతతో కంపెనీ 2.5 రెట్లు వృద్ధి సాధించడం గమనార్హం. స్విగ్గీతో కలిసి ఈ వృద్ధిని మరింత వేగవంతం చేయాలని ఆశిస్తున్నట్లు భేండే చెప్పారు.


Click it and Unblock the Notifications