Coca-Cola: ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణంగా ఉపయోగించే కృత్రిమ స్వీటెనర్‌లలో అస్పర్టమే ఒకటిగా కొనసాగుతోంది. అయితే దీని వినియోగం వల్ల క్యాన్సర్ సమస్యలు తలెత్తవచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ముడిపదార్థాన్ని వచ్చే నెల నాటికి సాధ్యమయ్యే క్యాన్సర్‌గా ప్రకటించబడుతుందని రాయిటర్స్ నివేదించింది. కృత్రిమ స్వీటెనర్ల వినియోగానికి వ్యతిరేకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించిన నెల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ వార్తల నేపథ్యంలో Aspartame ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

ప్రపంచ ప్రఖ్యాత కోకాకోలా,పెప్సీతో పాటు ఇతర కార్బోనేటెడ్ శీతలపానీయాలు, షుగర్ సిరప్స్, చూయింగ్ గమ్స్ వంటి ఉత్పత్తుల్లో ప్రస్తుతం అస్పర్టమేను వినియోగిస్తున్నారు. అత్యంత ప్రజాదరణ పొందిన పోషక రహిత స్వీటెనర్‌ను డైట్, షుగర్-ఫ్రీ, నో షుగర్, లో క్యాలరీ, జీరో షుగర్ ఆహారపదార్థాలుగా చెప్పేవాటిలో వినియోగిస్తారు. ఇది తెలుపు రంగులో, సాధారణ చక్కెర కంటే 200 రెట్లు తియ్యగా ఉండే వాసన లేని పొడి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) 1981లో ఆహారాలు, పానీయాల్లో అస్పర్టమే వాడకాన్ని ఆమోదించింది.
WHO క్యాన్సర్ పరిశోధన విభాగం అయిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్(IARC) ద్వారా మొట్టమొదటిసారిగా అస్పర్టమే మానవులకు క్యాన్సర్ కారకంగా ఉండవచ్చని జూలైలో జాబితా చేయబడుతుంది. IARCతో పాటు జాయింట్ ఆర్గనైజేషన్ ఎక్స్‌పర్ట్ కమిటీ ఆన్ ఫుడ్ అడిటివ్స్(JEFCA) ప్రస్తుతం అస్పర్టమే ప్రభావాలు, భద్రతపై సమీక్షిస్తోంది. ఈ వార్త ప్రస్తుతం కోకాకోలా ఉత్పత్తుల అమ్మకాలపై, అలాగే కంపెనీ షేర్లపై పడవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications