IPO News: తుఫాను లాభాలిచ్చిన ఐపీవో.. తొలిరోజే 46 శాతం ప్రీమియం గెయిన్స్..
Swashthik Plascon IPO: బీజేపీ అనూహ్య విజయంతో స్టాక్ మార్కెట్లు తమ కొత్త జీవితకాల గరిష్ఠాలకు ర్యాలీని కొనసాగిస్తున్న వేళ నేడు ఐపీవో సూపర్ లాభాలతో అరంగేట్రం చేసింది. దీంతో ఇన్వెస్టర్లు పండుగ చేసుకుంటున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఎస్ఎమ్ఈ కేటగిరీలో వచ్చిన స్వస్తిక్ ప్లాస్కాన్ ఐపీవో గురించే. కంపెనీ BSE SMEలో 39.65 శాతంతో రూ.120.10 రేటు వద్ద బలమైన లిస్టింగ్ నమోదు చేసింది. అయితే కొంత సేపటికే ఐపీవో షేర్ ధర రూ.126.10 స్థాయికి చేరుకుంది. అయితే ఆ తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మెుగ్గుచూపటంతో కొంత క్షీణతను స్టాక్ నమోదు చేసింది.

వాస్తవానికి కంపెనీ ఒక్కో షేరుకు ఐపీవో విక్రయ ధరను రూ.80 నుంచి రూ.86గా ప్రకటించింది. కంపెనీ ఇన్వెస్టర్ల కోసం ఐపీవో లాట్ పరిమాణాన్ని 1600 షేర్లుగా నిర్ణయించింది. దీని ప్రకారం ఒక లాట్ పెట్టుబడి కోసం పెట్టుబడిదారులు రూ.1,37,600 కనీసం పెట్టుబడిగా పెట్టారు. కంపెనీ ముందుగా యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.11.60 కోట్లను సమీకరించింది.
స్వస్తిక్ ప్లాస్కాన్ IPO నవంబర్ 24 నుంచి నవంబర్ 29 వరకు పెట్టుబడిదారుల కోసం తెరవబడింది. తాజా ఐపీవో నుంచి రూ.40.76 కోట్లను సమీకరించాలని కంపెనీ నిర్ణయించింది. ఇందుకోసం కంపెనీ మెుత్తంగా 47.39 లక్షల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేసింది. ఐపీవోకి ముందర కంపెనీలో 60 శాతం వాటాను కలిగి ఉన్న ప్రమోటర్లు ప్రస్తుతం 43.81 శాతం వాటాను కలిగి ఉన్నారు. కంపెనీ తాజా ఐపీవో నుంచి సేకరించిన మెుత్తాన్ని ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకునేందుకు, మెషినరీ కొనుగోలుకు, సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు, మూలధన అవసరాల కోసం వినియోగించనున్నట్లు ప్రకటించింది.


Click it and Unblock the Notifications