Energy Stock: కోటీశ్వరులను చేసిన పెన్నీ స్టాక్.. ఒక్కో షేర్ ధర 76 పైసలే.. ఇప్పుడు..
Energy Multibagger: ప్రస్తుతం దేశంలో ఎనర్జీ బూమ్ కొనసాగుతోంది. విద్యుత్ ఉత్పత్తి, డిస్ట్రిబ్యూషన్, సోలార్ అండ్ గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పనిచేస్తున్న అనేక కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన వారి సొమ్ము వేల రెట్లు పెరిగింది. మల్టీబ్యాగర్ రాబడులతో వారి సంపద అనేక రెట్లు పెరిగింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది స్వాన్ ఎనర్జీ షేర్ల గురించే. స్టాక్ ర్యాలీ కారణంగా షేర్ ధర విపరీతమైన పురోగతిని నమోదు చేసింది. మంగళవారం కంపెనీ షేర్లు రూ.542.55కి పడిపోయాయి. స్వాన్ ఎనర్జీ షేర్లు బుధవారం 11 శాతానికి పైగా పెరుగుదలతో రూ.608.80కి చేరాయి. గత కొన్నేళ్లుగా కంపెనీ షేర్లు అద్భుతమైన రాబడిని అందించిన సంగతి తెలిసిందే. స్వాన్ ఎనర్జీ షేర్లు 76 పైసల నుంచి రూ.608కి పెరిగి ఈ కాలంలో 78000% కంటే ఎక్కువ రాబడిని పెట్టుబడిదారులకు అందించాయి.

గత కొన్నేళ్లుగా స్వాన్ ఎనర్జీ షేర్లలో స్థిరమైన వృద్ధి నమోదైంది. స్వాన్ ఎనర్జీ షేర్లు 4 మార్చి 2004న ఒక్కొక్కటి కేవలం 76 పైసల వద్ద ఉన్నాయి. అయితే ఈ పెన్నీ ఎనర్జీ మల్టీబ్యాగర్ స్టాక్ ధర 13 మార్చి 2024న బీఎస్ఈలో రూ.608.80కి చేరుకున్నాయి. గడచిన పదేళ్లలో దాదాపు 855% రాబడిని స్టాక్ డెలివరీ చేసింది. మార్చి 14, 2014న కంపెనీ షేర్లు ఒక్కొక్కటి రూ.62.15 వద్ద ఉన్నాయి. కంపెనీ షేర్లను కొనుగోలు చేసి దీర్ఘకాలం పెట్టుబడిని కొనసాగించిన అనేక మంది పెట్టుబడిదారులు లక్షల పెట్టుబడితో కోట్లను గడించారు.
స్వాన్ ఎనర్జీ షేర్లు గత ఏడాది కాలంలో 115% రాబడిని అందించి ఇన్వెస్టర్ల సంపదను డబుల్ చేసింది. స్వాన్ ఎనర్జీ షేర్లు మార్చి 13, 2023న ఒక్కొక్కటి కేవలం రూ.280.65 రేటు వద్ద ఉన్నాయి. మార్చి 13, 2024న కంపెనీ షేర్లు రూ.608.80కి చేరుకున్నాయి. అలాగే 5 ఏళ్ల కాలాన్ని పరిశీలిస్తే.. స్వాన్ ఎనర్జీ షేర్లు 485% కంటే ఎక్కువ పెరిగాయి. మార్చి 15, 2019న కంపెనీ షేర్లు రూ.102.05 వద్ద ఉన్నాయి. ఎనర్జీ మల్టీబ్యాగర్ షేర్ల 52 వారాల గరిష్ఠ ధర రూ.782.55గా ఉంది. అలాగే 52 వారాల కనిష్ఠ స్థాయి రూ.193 వద్ద ఉంది.


Click it and Unblock the Notifications