Suzlon Energy: ఇటీవలి కాలంలో ఎక్కువగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల నోట నలుగుతున్న షేర్లలో సుజ్లాన్ ఎనర్జీ కూడా ఒకటి. ఒకప్పుడు పెన్నీస్టాక్ గా ఉన్న కంపెనీ షేర్లు ప్రభుత్వం రెన్యూవబుల్ ఎనర్జీ చర్యలతో చాలా కాలంగా పెరుగుతూనే ఉంది. దీంతో అనేక మంది ఇన్వెస్టర్లు ఈ ఎనర్జీ మల్టీబ్యాగర్ కంపెనీ షేర్ల కోసం ఎగబడిన పరిస్థితులు తెలిసిందే.
నేడు ఇంట్రాడేలో సుజ్లాన్ ఎనర్జీ స్టాక్ అత్యంత కీలకమైన లెవెల్ రూ.50 వద్ద తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. దీనికి ముందు కూడా కంపెనీ షేర్లు గత నెల జనవరి 28న ఇదే స్థాయి వద్ద ట్రేడింగ్ కొనసాగించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి చాలా మంది పెట్టుబడిదారులు ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించే పద్దు కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ క్రమంలో రెన్యూవబుల్ ఎనర్జీ రంగం ప్రోత్సాహానికి ఎలాంటి చర్యలు ఉంటాయి, అవి భవిష్యత్తులో పెట్టుబడిదారులకు ఎలాంటి రాబడిని అందిస్తాయనే అంశంపై అవగాహన కోసం వారు ఎదురుచూశారు.

గడచిన 6 నెలల కాలంలో కంపెనీ షేర్లు దాదాపు 37.52 శాతం క్షీణతను అందించగా.. 2025 ప్రారంభం నుంచి స్టాక్ 23 శాతానికి పైగా పడిపోయింది. అయితే నేడు మార్కెట్లు ముగిసే సమయంలో సుజ్లాన్ స్టాక్ ఎన్ఎస్ఈలో ఒక్కోటి రూ.50.64 వద్ద తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. కంపెనీ షేర్ల 52 వారాల గరిష్ఠ ధర రూ.86 నుంచి ప్రస్తుతం కంపెనీ షేర్లు దాదాపు 42 శాతం తక్కువ రేటు వద్ద తమ ప్రయాణాన్ని మార్కెట్లో కొనసాగిస్తున్నాయి.
బ్రోకరేజ్ మాట ఇదే..
సుజ్లాన్ ఎనర్జీ కంపెనీ షేర్లపై చాయిస్ బ్రోకింగ్ నిపుణుడు మండ్ర భోజనే స్పందిస్తూ స్టాక్ బేరిష్ ట్రెండ్ కారణంగా సైడ్ వేస్ ట్రేడింగ్ కొనసాగిస్తోందని అన్నారు. ఇటీవలి కాలంలో కంపెనీ షేర్లు దాదాపు 20 శాతం తగ్గుదలను చూసి దాదాపు రూ.50 స్థాయి వద్దకు చేరుకున్నాయని పేర్కొన్నారు. షేర్లు 54 స్థాయిని అధిగమిస్తే సమీప భవిష్యత్తులో రూ.64 స్థాయి వరకు చేరుకోవచ్చని కంపెనీ వెల్లడించగా.. స్టాక్ ధర 50 కిందకు పడిపోతే తర్వాతి సపోర్ట్ జోన్ లెవెల్ రూ.46 వద్ద ఉందని ఆయన పేర్కొన్నారు.
- ఇదే క్రమంలో జేఎం ఫైనాన్షియల్ కంపెనీ షేర్లకు రూ.80గా కంపెనీ ప్రకటిస్తూ BUY రేటింగ్ అందించింది.
కంపెనీ లాభాలు..
ఇటీవలి కాలంలో కంపెనీ తన త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మూడవ క్వార్టర్లో ఏడాది ప్రాతిపదికన కంపెనీ లాభాలు 90 శాతానికి పైగా పెరుగుదలను చూశాయి. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర ఆదాయం రూ.388 కోట్లుగా ఉంది. ఇదే కాలానికి కంపెనీ ఆదాయం భారీగా పెరిగి రూ.2,969 కోట్లుగా నమోదు కావటంతో భవిష్యత్తు వ్యాపారంపై ఇన్వెస్టర్లలో కొత్త ఆశలు చిగురించాయి.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications