Suzlon Energy: సుజ్లాన్ ఎనర్జీ షేర్లు ప్రతికూల మార్కెట్లలోనూ నేడు దూసుకుపోతున్నాయి. భారతీయ స్టాక్ మార్కెట్లలో ఏం నడుస్తోంది అంటే రెన్యూవబుల్ ఎనర్జీ స్టాక్ సుజ్లాన్ షేర్ల హవా నడుస్తుందని చెప్పుకోవచ్చు.
విండ్ టర్బైన్ తయారీ కంపెనీ సుజ్లాన్ ఎనర్జీ షేర్లు కొత్త వారం తొలిరోజున మరోసారి మార్కెట్లో పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో కంపెనీ షేర్లు ఇంట్రాడేలో 2 శాతానికి పైగా లాభపడి ముందుకు సాగుతున్నాయి. అయితే దీనికి వెనుక కారణాన్ని పరిశీలిస్తే.. ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ నుంచి విండ్ ఎనర్జీకి సంబంధించిన భారీ ఆర్డర్ సుజ్లాన్ అందుకున్నట్లు వెల్లడైంది. ఈ క్రమంలో సుజ్లాన్ 1,166 మెగావాట్ల భారీ ఆర్డర్‌ను పొందింది.

హైబ్రిడ్ లాటిస్ ట్యూబ్యులర్ టవర్‌లతో 370 విండ్ టర్బైన్ జనరేటర్‌లను ఇన్‌స్టాల్ చేయడం తాజా ఆర్డర్‌గా సుజ్లాన్ అందుకుంది. వీటి ఒక్కో టర్బైన్ 3.15 మెగావాట్ల సామర్థ్యంగా వెల్లడైంది. ప్రస్తుతం ప్రభుత్వ సంస్థ నుంచి అందుకున్న ఆర్డర్‌తో సెప్టెంబర్ 3, 2024 నాటికి సుజ్లాన్ మొత్తం ఆర్డర్ బుక్ 5 GWకి చేరుకుంది. గడచిన ఏడాది కాలంలో సుజ్లాన్ ఎనర్జీ షేర్లు 212% బంపర్ పెరుగుదలను నమోదు చేయటంతో కంపెనీ ఇన్వెస్టర్లు భారీ లాభాలను ఆర్జించారు.
సుజ్లాన్ ఇటీవలే రెనోమ్ ఎనర్జీలో 51% వాటాను కొనుగోలు చేసి.. దానిని అనుబంధ సంస్థగా మార్చుకుంది. ఆగస్టులో సుజ్లాన్ బోర్డు ఆమోదించిన రెండు లావాదేవీలతో రూ.660 కోట్ల డీల్‌లో భాగంగా ఈ కొనుగోలు జరిగింది. మొదటి లావాదేవీలో రెనోమ్ కంపెనీలో 51 శాతం షేర్లను రూ.400 కోట్లకు సుజ్లాన్ దక్కించుకోగా.. మరో 18 నెలల్లో 25 శాతం వాటాలను రూ.260 కోట్లకు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. సుజ్లాన్ ఎనర్జీ 1995లో ప్రారంభించబడింది. కంపెనీ పునరుత్పాదక ఇంధన రంగంలో ప్రముఖ కంపెనీగా కొనసాగుతోంది. కంపెనీ ప్రపంచ స్థాయిలో బలమైన ఉనికిని కలిగి ఉంది. భారతదేశంలో ఇది కార్బన్ పాదముద్రను తగ్గించడం, పర్యావరణ అనుకూల శక్తి పరిష్కారాలపై పని చేస్తోంది. భారత టర్బైన్ మార్కెట్‌లో సుజ్లాన్ ఎనర్జీ వాటా 32 శాతంగా ఉంది.
బ్రోకరేజ్ అభిప్రాయం..
బ్రోకరేజీ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఇటీవల సుజ్లాన్ ఎనర్జీ షేర్లపై టార్గెట్‌ను రూ.70 నుంచి రూ.80కి పెంచింది. అలాగే 'ADD' రేటింగ్ అందించింది. బ్రోకరేజ్ సంస్థ సుజ్లాన్‌ను ఎఫ్‌వై26 అంచనా వేసిన ఒక్కో షేరుకు రూ.1.60 కంటే 50 రెట్లు విలువ చేసింది. 2022 ఏప్రిల్‌లో నాన్-కోర్ ఆస్తులను విక్రయించడం ద్వారా సేకరించిన నిధులను సామర్థ్యాన్ని విస్తరించడానికి, మరిన్ని ఆర్డర్‌లను గెలుచుకోవడానికి సుజ్లాన్ యోచిస్తున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తెలిపింది.


Click it and Unblock the Notifications