Q3 Results: క్యూ3లో సుజ్లాన్ ఎనర్జీ సూపర్ లాభాలు .. స్టాక్ రాకెట్ పరుగులు..
Suzlon Energy Share: ఇండియాతో పాటు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధనం వైపు మళ్లుతున్నాయి. పైగా భారత ప్రభుత్వం సైతం రానున్న కాలంలో ఈ రంగాన్ని ప్రోత్సహించాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో రెన్యూవబుల్ ఎనర్జీ రంగానికి చెందిన విండ్ ఎనర్జీ కంపెనీ సుజ్లాన్ క్యూ3లో సూపర్ లాభాలను నమోదు చేసింది. డిసెంబరుతో ముగిసిన త్రైమాసిక కాలానికి కంపెనీ నికర లాభం రూ.203 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ ఆదాయం రూ.78.36 కోట్ల కంటే ప్రస్తుత లాభాలు 159.11 శాతం అధికంగా ఉన్నాయి.

ఎఫ్‌వై24 క్యూ3లో కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆదాయం 7.17 శాతం పెరిగి రూ.1,552.91 కోట్లకు చేరుకుంది. ఇది అంతకు ముందు ఏడాది కాలంలో కేవలం రూ.1,448.97 కోట్లుగా ఉన్నాయి. నేడు కంపెనీ తన కార్పొరేట్ వ్యాపార ఫలితాలను ప్రకటించటంతో స్టాక్ ధర 4.86 శాతం పెరిగి ఏడాది గరిష్ఠ స్థాయి రూ.45.95ను తాకింది. పెట్టుబడిదారులు సైతం తక్కువ ధరలో అందుబాటులో ఉన్న కంపెనీ షేర్లను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తిని కనబరచటంతో షేర్ ధర కొత్త జీవితకాల గరిష్ఠాలకు చేరుకుంది.
కంపెనీ ప్రస్తుతం కొత్త కస్టమర్ల నుంచి గణనీయంగా ఆర్డర్లను పొందుతూ పటిష్టంగా ఉన్నట్లు సుజ్లాన్ గ్రూప్ వైస్-ఛైర్మన్ గిరీష్ తంతి వెల్లడించారు. వ్యాపారంలో కస్టమర్లు తమకు అందించిన నమ్మకంతో గ్రీన్ ఎనర్జీ ఆకాంక్షలను సాకారం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. రాబోయే దశాబ్దం ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక విద్యుత్ రంగానికి చాలా కీలకమైనదిగా ఆయన అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications