Suzlon Energy Stock: దేశీయంగా తక్కువ ధరలో అందుబాటులో ఉన్న రెన్యూవబుల్ ఎనర్జీ రంగానికి చెందిన షేర్లకు నిరంతరం డిమాండ్ కొనసాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విండ్ ఎనర్జీ రంగానికి చెందిన సుజ్లాన్ ఎనర్జీ షేర్లపై పెట్టుబడిదారుల ఫోకస్ కొనసాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా దాదాపు 38 శాతం క్షీణతను చూసిన ఈ కంపెనీ షేర్లు మళ్లీ తిరిగి గాడినపడ్డాయి.
నేడు ఇంట్రాడేలో విండ్ ఎనర్జీ కంపెనీ షేర్లు మార్కెట్లో 5 శాతం పెరుగుదలతో అప్పర్ సర్క్యూట్ తాకాయి. దీంతో కంపెనీ షేర్ ధర బీఎస్ఈలో రూ.62.37కి చేరుకుంది. అయితే ఒక్కసారిగా ఇన్వెస్టర్లు కంపెనీ షేర్ల కొనుగోలుకు ఎగబడటానికి కారణం రేటింగ్ అప్ గ్రేడ్ గా తెలుస్తోంది. ప్రముఖ విదేశీ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తాజాగా విండ్ ఎనర్జీ కంపెనీ అయిన సుజ్లాన్ షేర్లకు తన రేటింగ్ ప్రకటించింది. గతంలో అందించిన సమాన బరువు నుంచి ప్రస్తుతం అధిక బరువుకు రేటింగ్ పెంచబడింది. దీనికి ముందు నవంబర్ 12 నుంచి కంపెనీ షేర్ల ధర ఒక్కోటి రూ.60 కంటే తక్కువకు దిగజారాయి. ఈ క్రమంలో చివరిగా సెప్టెంబర్ 12, 2024న కంపెనీ షేర్లు తమ 52 వారాల గరిష్ఠ ధర రూ.86.05ని చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి కరెక్షన్ కి గురైన స్టాక్ ఏకంగా 33 శాతానికి పైగా పతనాన్ని చూసింది.

ఈ క్రమంలో ప్రస్తుతం మోర్గన్ స్టాన్నీ కొత్తగా అప్ గ్రేజ్ చేసిన షేర్ టార్గెట్ ధరపై అందరి చూపు కొనసాగుతోంది. రానున్న కాలంలో స్టాక్ ధర రూ.71 స్థాయికి చేరుకోవచ్చని బ్రోకరేజ్ పేర్కొంది. ఇటీవలి కాలంలో సుజ్లాన్ స్టాక్ భారీగా పతనాన్ని చూసిన తర్వాత ప్రస్తుతం ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను కొనసాగించటానికి అనువైన సమయమని ఈ అవకాశాన్ని వారు వినియోగించుకోవాలని మోర్గన్ స్టాన్లీ వెల్లడించింది. దీంతో చాలా మంది పెట్టుబడిదారులు తిరిగి కంపెనీ షేర్లను కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. ఈ క్రమంలో నేడు ఇంట్రాడేలో స్టాక్ 5 శాతం అప్పర్ సర్యూట్ ధర రూ.62.22 వద్ద ఎన్ఎస్ఈలో కొనసాగుతోంది.
సుజ్లాన్ ఎనర్జీ షేర్లు నాలుగు వరుస సెషన్ల తర్వాత నేడు రూ.60 మార్కును తిరిగి పొందాయి. మల్టీబ్యాగర్ స్టాక్ మూడవ సెషన్‌లో 5% అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. గడచిన రెండేళ్ల కాలాన్ని పరిశీలిస్తే స్టాక్ తన పెట్టుబడిదారులకు ఏకంగా 670 శాతం పెరుగుదలను చూసింది. 18 నవంబర్ 2022న కంపెనీ షేర్ ధర ఒక్కోటి రూ.8.10 వద్ద ఉంది. అలాగే మూడేళ్ల కాలంలో పెట్టుబడిదారులు స్టాక్ నుంచి 883% రాబడిని అందుకున్నారు. ఇదే క్రమంలో స్టాక్ గత ఏడాది కాలంలో తన పెట్టుబడిదారులకు 50 శాతం కంటే ఎక్కువ రాబడిని తెచ్చిపెట్టింది.
- ప్రస్తుతం దేశీయ బ్రోకరేజ్ సంస్థ జియోజిత్ కంపెనీ షేర్లకు BUY రేటింగ్ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో కంపెనీ షేర్లకు రూ.68 టార్గెట్ ధరను అందించింది.
- మరో బ్రోకరేజ్ సంస్థ ప్రభుదాస్ లిల్లాధర్ సుజ్లాన్ ఎనర్జీ షేర్లకు టార్గెట్ ధరను గతంలో అందించిన రూ.70 నుంచి ప్రస్తుతం రూ.75కి పెంచింది.
- అలాగే ఛాయిస్ బ్రోకింగ్ కంపెనీ సైతం ప్రస్తుత ధరలు షేర్ల కొనుగోలుకు అనుకూలమైనదిగా పేర్కొంది. ఒకవేళ స్టా ధర సపోర్ట్ లెవల్ కిందకు జారితే మరింతగా దిగజారే ప్రమాదం ఉందన్నారు. ఈ క్రమంలో టార్గెట్ ధరను రూ.66-70గా పేర్కొంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications