Suzlon Energy: పునరుత్పాదక ఇంధన రంగంలో పనిచేస్తున్న కంపెనీల్లో సుజ్లాన్ ఒకటి. మోదీ సర్కార్ గతకొంత కాలంలో కర్భన ఉద్గారాలను తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో కంపెనీ సైతం కీలక పాత్ర పోషిస్తోంది. అయితే ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినవారికి నేడు భారీ షాక్ తగిలింది.
విండ్ టర్బైన్ తయారీ కంపెనీ సుజ్లాన్ ఎనర్జీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం మార్కెట్ ప్రారంభమైన వెంటనే సుజ్లాన్ ఎనర్జీ షేర్లు పడిపోయాయి. బీఎస్ఈలో ఎనర్జీ కంపెనీ షేర్ల ధర ఏకంగా 5% పడిపోయి రూ.47.35కి చేరుకుంది. కంపెనీలో ఇండిపెండెంట్ డైరెక్టర్ రాజీనామా తర్వాత షేర్లలో ఈ భారీ పతనం చోటు చేసుకుంది. డైరెక్టర్ మార్క్ డెసిడ్లర్ కార్పోరేట్ గవర్నెన్స్ సమస్యలను పేర్కొంటూ వారాంతంలో రాజీనామా చేశారు. మరో పక్క బ్రోకరేజ్ నువామా మాత్రం కంపెనీ షేర్లకు బై రేటింగ్ ఇస్తూ షేర్ టార్గెట్ ధరను రూ.53గా ప్రకటించింది.

సుజ్లాన్ గ్రూప్ ఛైర్మన్ వినోద్ తంతికి ఇండిపెండెంట్ డైరెక్టర్ మార్క్ రాసిన రాజీనామా లేఖ ప్రకారం.. గత 18 నెలల్లో సుజ్లాన్ కార్యాచరణ, ఆర్థిక పనితీరు పట్ల తాను చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు. అయితే కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలు వారి అంచనాలను అందుకోలేని అనేక పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇండిపెండెంట్ డైరెక్టర్ లేవనెత్తిన అంశాలు చాలా సాఫ్ట్, ప్రాసెస్ ఓరియెంటెడ్ అని బ్రోకరేజ్ హౌస్ నువామా చెబుతోంది. నువామా ఈ ఏడాది మే చివరిలో సుజ్లాన్ ఎనర్జీ కవరేజీని ప్రారంభించింది.
సుజ్లాన్ ఎనర్జీ షేర్లు గత ఏడాదిలో 210% కంటే ఎక్కువ లాభపడ్డాయి. జూన్ 12, 2023న విండ్ టర్బైన్ తయారీ కంపెనీ సుజ్లాన్ ఎనర్జీ షేరు రూ.15.29 వద్ద ఉంది. జూన్ 10, 2024న కంపెనీ షేర్లు రూ.47.35కి చేరుకున్నాయి. అదే సమయంలో గడచిన మూడేళ్లలో సుజ్లాన్ ఎనర్జీ షేర్లు 625% కంటే ఎక్కువ పెరిగాయి. జూన్ 11, 2021న కంపెనీ షేర్లు రూ.6.54 వద్ద ఉన్నాయి. జూన్ 10, 2024న సుజ్లాన్ ఎనర్జీ షేర్లు రూ.47.35కి చేరాయి. కంపెనీ షేర్ల 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.52.19. అదే సమయంలో సుజ్లాన్ ఎనర్జీ షేర్ల 52 వారాల కనిష్ట స్థాయి రూ.13.21గా ఉంది.


Click it and Unblock the Notifications