Suzlon Energy Shares: కంపెనీ వ్యాపారాన్ని ముందు తీసుకెళ్లేందుకు పోరాడిన గతం నుంచి ఆశాజనక భవిష్యత్తు పరిస్థితులతో సుజ్లాన్ ఎనర్జీ విండ్ ఎనర్జీ విప్లవంతో ముందంజలో కొనసాగుతోంది. కార్పోరేట్ భారతదేశ చరిత్రలో సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్ గొప్ప పునరాగమనంలో ఒకటిగా ఉంది. అయితే ఈ దూకుడు కొనసాగించటానికి ఇంకా అవకాశం ఉందా అనే అంశం పెద్ద మార్కెట్లలో కొనసాగుతోంది.
ఈ క్రమంలో ఏప్రిల్ 2023 నుంచి సెప్టెంబర్ 2024 మధ్య కాలంలో సుజ్లాన్ స్టాక్ ఏకంగా 9 రెట్లు పెరుగుదలను చూశాయి. ఈరోజు ఇంట్రాడేలో సుజ్లాన్ స్టాక్ 5 శాతం పెరిగి రూ.81.95 రేటు వద్ద అప్పర్ సర్క్యూట్ తాకింది. వాస్తవానికి తాజాగా ప్రభుత్వ సంస్థ ఎన్టీపీసీతో చేసుకున్న డీల్ కంపెనీ ఆదాయాలను పెంచటానికి దోహదపడుతుందని ప్రముఖ బ్రోకరేజ్ మోర్గన్ స్టాన్లీ నిన్న వెల్లడించటంతో నేడు సుజ్లాన్ షేర్లు లాభపడ్డాయి. దీర్ఘకాలిక వ్యూహంతో కంపెనీ షేర్లలో నాలుగుతున్నర ఏళ్ల కిందట పెట్టుబడి పెట్టి ఇప్పటి వరకు కొనసాగించిన ఇన్వెస్టర్లు 4600% పైగా రాబడిని అందుకున్నారు.

ఎవరైనా ఇన్వెస్టర్స్ మార్చి 27, 2020న సుజ్లాన్ ఎనర్జీ షేర్లను రూ.1.72 వద్ద లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే ఆ పెట్టుబడి మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.47.64 లక్షలకు చేరి ఉండేది. అలాగే రెండేళ్ల కిందట కంపెనీ షేర్లను సెప్టెంబర్ 9, 2022లో రూ.8.84 వద్ద పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు ప్రస్తుతం 827 శాతం రాబడిని అందుకున్నారు. ఇక గడచిన ఏడాది కాలాన్ని పరిశీలిస్తే.. రెన్యూవబుల్ ఎనర్జీ షేర్లు తన పెట్టుబడిదారులకు 113 శాతం రాబడిని అందించింది. అలాగే జనవరి 1, 2024న కంపెనీ షేర్లు ఒక్కోటి రూ.38.48 వద్ద ట్రేడింగ్ అయ్యాయి. ఎనర్జీ రంగంలో కంపెనీ షేర్లు ప్రస్తుతం రారాజుగా కొనసాగుతోంది.
గతవారం విండ్ ఎనర్జీ కంపెనీ ప్రభుత్వ యాజమాన్యంలోని ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ నుంచి భారీ ఆర్డర్ అందుకుంది. ఇది దేశంలోనే అతిపెద్ద విండ్ ఎనర్జీ ఆర్డర్ అని కంపెనీ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. ప్రస్తుతం సుజ్లాన్ ఎనర్జీ షేర్లు 52 వారాల గరిష్ఠ ధర రూ.84.40కి అతిచేరువలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఇదే క్రమంలో కంపెనీ స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ.21.71గా ఉంది.


Click it and Unblock the Notifications