Suzlon Energy Shares: సుజ్లాన్ స్టాక్ మార్కెట్లలో చాలా మంది పెన్నీ స్టాక్ బయ్యర్లకు పరిచయం అక్కర్లేని కంపెనీ. ఎందుకంటే ఈ షేర్ ధర ఒక్కోటి 10 రూపాయల కంటే తక్కువగా ఉన్నప్పుడే వేల మంది దీని మల్టీబ్యాగర్ సామర్థ్యాలను గుర్తించారు. రెన్యూవబుల్ ఎనర్జీ రంగానికి ఉన్న ప్రాముఖ్యతను పసిగట్టారు.
గ్లోబల్ మార్కెట్ల ప్రతికూలతలతో ప్రస్తుతం భారతీయ స్టాక్ మార్కెట్లు సైతం పతనంలో ఉన్న సంగతి తెలిసిందే. దీనికి ముందే ఎఫ్ఐఐల అమ్మకాలతో బేర్ పంజాలో చిక్కుకుని కరెక్షన్ ఫేజ్ కొనసాగుతోంది. మెగా బుల్ ర్యాలీ తర్వాత పతనం ఉన్నప్పటికీ సుజ్లాన్ ఎనర్జీ కంపెనీ షేర్లు మాత్రం నేడు ఇంట్రాడేలో 4 శాతానికి పైగా లాభపడ్డాయి. దీంతో ఇంట్రాడేలో స్టాక్ ధర రూ.51.49కి చేరుకుని ఎన్ఎస్ఈలో బౌన్స్ బ్యాక్ చూసింది.

నేడు దేశీయ మార్కెట్ల పనితీరుతో సంబంధం లేకుండా సుజ్లాన్ కంపెనీ షేర్లు లాభపడటానికి అసలు కారణం కంపెనీ మూడోసారి జిందాల్ గ్రీన్ విండ్ సంస్థ నుంచి 204.75 మెగావాట్లకు ఆర్డర్ పొందటమే. వాస్తవానికి ఈ సంస్థ జిందాల్ రెన్యూవబుల్స్ కి అనుబంధ సంస్థ కావటం గమనార్హం. ఈ భాగస్వామ్యం ఇప్పుడు సుజ్లాన్ అతిపెద్ద వాణిజ్య & పారిశ్రామిక ఆర్డర్. దీంతో మెుత్తం ఆర్డర్ 907.20 మెగావాట్లకు చేరుకుంది. ఇప్పటికే జిందాల్ కంపెనీ ఛత్తీస్‌గఢ్, ఒడిశాలో కలిగి ఉన్న జిందాల్ స్టీల్ ప్లాంట్లకు అవసరమైన విద్యుత్ తయారీ కోసం రెండు ఆర్డర్లను సుజ్లాన్ దక్కించుకుంది.
ప్రస్తుతం సుజ్లాన్ ఆర్డర్ బుక్ గమనిస్తే పెద్ద వాణిజ్య & పారిశ్రామిక కస్టమర్ల వాటా 59 శాతంగా ఉండటం గమనార్హం. ఇది కంపెనీ చరిత్రలో అత్యధికంగా కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం జిందాల్ కొత్త ఆర్డప్ పరిశీలిస్తే.. సుజ్లాన్ 65 అత్యాధునిక S144 విండ్ టర్బైన్ జనరేటర్‌లను హైబ్రిడ్ లాటిస్ టవర్స్ తో సరఫరా చేయనున్నట్లు వెల్లడైంది. ఇవి ఒక్కొక్కటి 3.15 MW విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటాయి. ఉత్పత్తి చేయబడిన శక్తిని ఛత్తీస్‌గఢ్, ఒడిశాలోని ఉక్కు కర్మాగారాల్లో క్యాప్టివ్ వినియోగం కోసం ఉపయోగిస్తారు. ఇది భారత ప్రభుత్వం నిర్థేశించుకున్న గ్రీన్ ఎనర్జీ పరివర్తనలో భాగంగా మారటానికి జిందాల్ కు దోహదపడనుంది.
గతవారం నోటీసులు..
2020-21, 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాల్లో GST రిటర్న్‌లలో అదనపు ఇన్‌పుట్ క్రెడిట్ పొందారనే ఉందని ఆరోపిస్తూ సెంట్రల్ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం చెన్నై నార్త్ కమిషనరేట్ కంపెనీపై దాదాపు రూ.1.18 కోట్ల జరిమానా విధించిందని కంపెనీ నేడు స్టాక్ మార్కెట్లకు కంపెనీ వెల్లడించింది. ఇది కూడా ప్రతికూల మార్కెట్లలో స్టాక్ పతనానికి ఒక కారణంగా నిలిచింది. ఈ చర్య కంపెనీ కార్యకలాపాలపై ఎలాంటి గణనీయమైన ప్రభావాన్ని చూపబోదని స్పష్టం చేసింది. దీంతో నేడు కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపు రూ.67 వేల కోట్ల వద్ద కొనసాగుతోంది.
కర్ణాటకలోని ప్రారంభ విజయాల ఆధారంగా కంపెనీ ప్రస్తుతం తక్కువ CO₂ స్టీల్ ఉద్యమాన్ని తమిళనాడుకు విస్తరిస్తున్నట్లు సుజ్లాన్ గ్రూప్ వైస్ చైర్మన్ గిరీష్ తంతి వెల్లడించారు. భారతదేశంలో స్థిరమైన పారిశ్రామిక వృద్ధి భవిష్యత్తు కోసం తాము నిరంతరం కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో కంపెనీ ప్రభుత్వ విద్యుత్ రంగ సంస్థల నుంచి కూడా ఆర్డర్స్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇది కంపెనీకి రానున్న త్రైమాసికాల్లో బలమైన లాభదాయకతకు దోహదపడుతుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..



Click it and Unblock the Notifications