Suzlon Stock: రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో చాలా మంది ఇన్వెస్టర్ల ప్రియమైన స్టాక్ సుజ్లాన్. చాలా కాలంగా ఈ కంపెనీ షేర్లలో బూమ్ కొనసాగుతోంది. తాజాగా నేడు కంపెనీ షేర్లు అప్పర్ సర్క్యూట్ తాకటంతో మరోమారు మార్కెట్లో అందరి దృష్టి కంపెనీ షేర్లపై పడింది.
సుజ్లాన్ ఎనర్జీ షేర్లు ఇంట్రాడేలో నేడు 5 శాతం అప్పర్ సర్క్యూట్ ధర రూ.51.34ను తాకి లాక్ అయ్యాయి. కొంత కాలం తర్వాత కంపెనీ షేర్ ధర రూ.50 మార్కును అధిగమించింది. నేటి పెరుగుదలతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.70,000 కోట్లకు చేరుకుంది. సుజ్లాన్ షేర్ల ధర 4 జూన్ 2024న రూ.52.19 వద్ద 52 వారాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. 2024 ప్రారంభం నుంచి ఇప్పటివరకు స్టాక్ దాదాపు 35 శాతం పెరిగుదలను నమోదు చేసింది. అలాగే గత నెలలో స్టాక్ తన ఇన్వెస్టర్లకు 18 శాతం రాబడిని అందించింది.

మేలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు సుజ్లాన్ కంపెనీకి చెందిన కోటి కంటే ఎక్కువ ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశాయి. ఆసక్తికరంగా స్టాక్ పెట్టుబడిదారులకు రెండంకెల రాబడిని అందించింది. మే 2024 నాటికి కంపెనీలో మ్యూచువల్ ఫండ్స్ రూ.2,172 కోట్ల విలువైన కంపెనీలో వాటాను కలిగి ఉన్నాయి. గ్రీన్ ఎనర్జీని పెంచడానికి కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలతో దలాల్ స్ట్రీట్‌లోని హాట్ ఇన్వెస్ట్‌మెంట్ థీమ్‌లలో పునరుత్పాదక ఇంధన కంపెనీల ఆకర్షణీయంగా మారాయి. 2030 నాటికి 500 GW పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని సాధించాలనే ప్రభుత్వ లక్ష్యం ఈ పరిశ్రమ పట్ల మార్కెట్‌ను సానుకూలంగా మార్చింది.
భారతదేశ పునరుత్పాదక ఇంధన రంగం రూ.20.8 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించనుందని కొన్ని నివేదికల ప్రకారం వెల్లడైంది. అయితే గతవారం సుజ్లాన్ కంపెనీలో ఒక పరిణామం చోటుచేసుకుంది. కంపెనీలోని ఇండిపెండెంట్ డైరెక్టర్లలో ఒకరైన మార్క్ దేశాడెలీర్ రాజీనామా చేసిన తర్వాత కంపెనీ కార్పొరేట్ పాలనా విధానాలను అంచనా వేయడానికి భారతదేశంలోని ప్రముఖ న్యాయ సంస్థ ఖైతాన్ & కోను నియమించినట్లు ప్రకటించింది.
ఇక్కడ శుభవార్త ఏమిటంటే.. గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ ఇండియా చైర్‌గా వైస్ చైర్మన్ గిరీష్ తంతి ఎన్నికైనట్లు కంపెనీ ప్రకటించింది. ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీ షేర్లపై దేశీయ బ్రోకరేజ్ సంస్థలు సానుకూలంగా ఉన్నాయి. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ స్టాక్‌కు BUY రేటింగ్‌ను రూ.60 టార్గెట్ ధరతో కలిగి ఉంది. ఇదే క్రమంలో JM ఫైనాన్షియల్ షేర్ టార్గెట్ ధరను రూ.54గా ఉంచగా, నువామా మాత్రం రూ.53 ధర వద్ద బై రేటింగ్ అందించాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications