Suzlon Shares: భారత్ గ్రీన్ ఎనర్జీ దిశగా వేస్తున్న ప్రతి అడుగు సుజ్లాన్ ఎనర్జీ కంపెనీ షేర్లపై ఇన్వెస్టర్ల దృష్టిని పెంచుతోంది. దీనికి తోడు కంపెనీ వేగంగా వ్యాపారవృద్ధిలో భాగంగా చేస్తున్న ప్రయత్నాలు సైతం కంపెనీ షేర్లను సానుకూలంగా ప్రభావితం చేస్తున్నాయి.
విదేశీ బ్రోకరేజ్ మోర్గాన్ స్టాన్లీ దేశీయ పునరుత్పాదక ఇంధన పరిష్కారాల సంస్థ సుజ్లాన్ షేర్లపై 'ఓవర్ వెయిట్' సిఫార్సును కొనసాగిస్తూ షేరుకు రూ.73.40 టార్గెట్ ధరగా ప్రకటించింది. దీంతో కంపెనీ షేర్ల ధర ఇంట్రాడేలో 5 శాతం పెరిగాయి. సుజ్లాన్ ఎనర్జీ మంగళవారం ముగింపు ధర కంటే టార్గెట్ ధర దాదాపు 11 శాతం ఎక్కువ. అలాగే సంజయ్ ఘోదావత్ గ్రూప్ రెనోమ్ ఎనర్జీ సర్వీసెస్‌లో 76 శాతం వాటాను రెండు విడతలుగా కొనుగోలు చేసేందుకు సుజ్లాన్ ఎగ్జిక్యూటెడ్ డెఫినిటివ్ ఒప్పందాలపై సంతకం చేయటం కూడా స్టాక్ పెరుగుదలకు దారితీసింది.

విండ్‌లో 1,782 మెగావాట్లు, సోలార్‌లో 148 మెగావాట్లు, కస్టమర్ విభాగాల్లో నిర్వహణలో ఉన్న బీఓపీలో 572 మెగావాట్ల ఆస్తులతో Renom దేశంలోనే అతిపెద్ద మల్టీ బ్రాండ్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ సర్వీస్ ప్రొవైడర్ సంస్థగా కొనసాగుతోంది. రెనమ్ ఎనర్జీ డీల్‌లో మొదటి విడతగా రూ.400 కోట్లతో 51 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు సుజ్లాన్ యాజమాన్యం తెలిపింది.
అలాగే రెండవ విడతలో సుజ్లాన్ ఎనర్జీ 18 నెలలలోపు రూ.260 కోట్లతో అదనంగా 25 శాతం వాటాను కొనుగోలు చేస్తుంది. 2030 నాటికి 500 GW పునరుత్పాదక ఇంధన సంస్థాపనలను సాధించాలనే భారతదేశ లక్ష్యంతో తాము మార్కెట్లో వివిధ రకాలైన సాంకేతికతలు, విండ్ టర్బైన్‌లు ముందుకు సాగడం చూస్తున్నట్లు కొనుగోలుపై సుజ్లాన్ గ్రూప్ వైస్ చైర్మన్ గిరీష్ తాంతి వ్యాఖ్యానించారు.
నేడు ఎన్ఎస్ఈలో సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్ స్టాక్ ధర రూ.69.58గా ఉంది. ఇదే క్రమంలో మార్కెట్లోని ఇతర బ్రోకరేజ్ సంస్థలు కంపెనీ షేర్లపై అందించిన టార్గెట్ ధరలను గమనిస్తే.. సుజ్లాన్ ఎనర్జీపై JM ఫైనాన్షియల్ టార్గెట్ ధరను రూ.71గా ఉంచంది. అలాగే జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ టార్గెట్ ధరను రూ.73గా ఉంటగా.. ఆనంద్ రాఠీ షేర్లు & స్టాక్ బ్రోకర్ల టార్గెట్ రూ.68, నువామా ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ రూ.64 వద్ద టార్గెట్ ధరను కలిగి ఉన్నాయి.


Click it and Unblock the Notifications