Suzlon Stock: సంక్షోభంలో సుజ్లాన్ ఎనర్జీ స్టాక్.. వరుస నోటీసులు, మీరూ ఇన్వెస్ట్ చేశారా .?
Suzlon Energy Shares: ఈవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ ఒడిదొడుకులను చూస్తున్నాయి. ఈ క్రమంలో వరుస నష్టాలు అనేక రంగాల్లోని కంపెనీలకు భారీగా క్షీణింపజేస్తున్నాయి. ఈ సమయంలో ఎనర్జీ రంగానికి చెందిన కంపెనీలు ఒకదాని తర్వాత మరొక చిక్కుల్లో చిక్కుకుంటోంది. దీంతో ఈ కంపెనీల షేర్లలో డబ్బులు ఇన్వెస్ట్ చేసిన చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు.
ఈరోజు ఇంట్రాడేలో సుజ్లాన్ లిమిటెడ్ కంపెనీ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. దీంతో 4 శాతం పతనంతో స్టాక్ నేటు రూ.66.12 వద్ద కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. అయితే చివరికి నష్టాల నుంచి తేరుకుని స్టాక్ ఒక్కోటి ఎన్ఎస్ఈలో రూ.68.85 వద్ద తన ప్రయాణాన్ని ముగించింది. అయితే గడచిన 5 ట్రేడింగ్ సెషన్లలో షేర్లు 8 శాతం పడిపోయాయి. అలాగే స్టాక్ నెలరోజుల కాలంలో ఏకంగా 18 శాతం క్షీణతను నమోదు చేసింది. గత నెల నుంచి విండ్ ఎనర్జీ కంపెనీపై వరుసగా చర్యలు రావటం ఇన్వెస్టర్లలో ఆందోళనలు ప్రేరేపిస్తున్నాయి. దీని ప్రభావం షేర్లపై కూడా ప్రభావం పడింది. ఇటీవలి కాలంలో ముఖ్యంగా దేశంలోని అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్ నుంచి వార్నింగ్ లెటర్ రావటం తర్వాత స్టాక్ కుప్పకూలుతోంది.

CGST చట్టం, 2017లోని సెక్షన్ 74 ప్రకారం ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను షార్ట్ రివర్సల్ చేసినందుకు హైదరాబాద్‌లోని ఇన్‌డైరెక్ట్ టాక్స్ అండ్ కస్టమ్స్ కమిషనర్ కార్యాలయం రూ.4,158 జరిమానా విధించినట్లు కంపెనీ బుధవారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. సూపరింటెండెంట్- SAG41, ఆడిట్-1, హైదరాబాద్, తెలంగాణ ద్వారా ఆడిట్ అవలోకనాన్ని అనుసరించి, విండ్ ఎనర్జీ మేజర్ అక్టోబర్ 22, 2024న పెనాల్టీ ఆర్డర్‌ను అందుకుంది. వాస్తవానికి ఈ పెనాల్టీ నామమాత్రమైనదని, దీని ప్రభావం కంపెనీ వ్యాపార కార్యకలాపాలపై ఉండబోదని వెల్లడైంది. దీనికి ముందు సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్‌లో స్వతంత్ర డైరెక్టర్ అయిన మార్క్ దేసాడెలీర్, కంపెనీ కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ జూన్ 8, 2024న రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
అయితే కొన్ని బ్రోకరేజీలు మాత్రం సుజ్లాన్ ఎనర్జీ షేర్లకు మంచి భవిష్యత్తు ఉందని ఈ క్రమంలో షేర్ ధర రూ.80ని మించనుందని అంచనాలు వెల్లడించాయి. అయితే ప్రస్తుతం స్టాక్ పతనం కరెక్షన్‌లో భాగమా లేక వరుస ఎదురుదెబ్బల ఫలితమా అనే ఆందోళన చాలా మంది సుజ్లాన్ ఇన్వెస్టర్లలో కొనసాగుతోంది. ప్రధానంగా రెన్యూవబుల్ ఎనర్జీవైపు భారత్ సహా ప్రపంచ దేశాలు వేగంగా అండుగులు వేస్తున్న వేళ విండ్ ఎనర్జీ రంగంలోని కంపెనీ షేర్లు బుల్ జోరును చూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అక్టోబర్ 25, 2019న స్టాక్ ధర రూ.2.34 నుంచి గరిష్ఠంగా గడచిన ఏడాది కాలంలో రూ.86.04కి చేరుకున్నాయి. నేడు మార్కెట్లు ముగింపు సమయంలో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.93,960 కోట్లుగా ఉంది. అయితే ఏడాది కాలంలో ఇన్వెస్టర్లకు స్టాక్ దాదాపు 120 శాతం రాబడిని అందించింది.


Click it and Unblock the Notifications