Suzlon Stock: ఎన్ఎస్ఈ-బీఎస్ఈ హెచ్చరికతో సుజ్లాన్ స్టాక్ ఢమాల్.. ఇన్వెస్టర్స్ జర జాగ్రత్త..!!
Suzlon Energy Shares: చాలా కాలంగా దేశీయ స్టాక్ మార్కెట్లలో తిరుగులేని ప్రయాణాన్ని చూస్తున్న సుజ్లాన్ కంపెనీ షేర్లు ప్రస్తుతం పతనంలో కొనసాగుతున్నాయి. సోమవారం వరుసగా 8వ ట్రేడింగ్ సెషన్లోనూ నష్టాలను చవిచూసింది. అయితే దీనికి మార్కెట్ల పతనంతో పాటు స్టాక్ ఎక్స్ఛేంజీల హెచ్చరిక కూడా కీలకమైనదిగా ఉంది.
రెన్యూవబుల్ ఎనర్జీ సొల్యూషన్ ప్రొవైడర్ BSE, NSE బోర్సెస్ నుంచి 'సలహా కమ్ హెచ్చరిక' లేఖను అందుకుంది. గతంలో రాజీనామా చేస్తున్న స్వతంత్ర డైరెక్టర్ లేవనెత్తిన సమస్యలపై కంపెనీ నుంచి వచ్చిన ప్రతిస్పందనలు, పత్రాలను సమీక్షించినప్పుడు కంపెనీ మెరుగైన కార్పొరేట్ గవర్నెన్స్ పద్ధతులను అనుసరించే కొన్ని సందర్భాలు ఉన్నట్లు గుర్తించబడినట్లు ఎక్స్ఛేంజీలు పేర్కొన్నాయి. ఈ లేఖలో జూన్ 8, 2024న సుజ్లాన్ సమర్పించిన బహిర్గతం గురించి, స్వతంత్ర డైరెక్టర్‌గా మార్క్ దేశాడెలీర్ రాజీనామా చేయడం గురించి, రాజీనామా లేఖ కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలు అంచనాలను అందుకోలేదని హైలైట్ చేసింది.

ఈ ప్రభావం కంపెనీ షేర్లపై నిరంతరం కొనసాగుతున్న వేళ నేడు విండ్ ఎనర్జీ స్టాక్ ధర 5 శాతం పతనాన్ని చూసింది. దీంతో నేడు ఒక్కో షేరు రూ.70.93 రేటు వద్ద ప్రయాణాన్ని ముగించాయి. అలాగే గడచిన ఐదు రోజులుగా స్టాక్ దాదాపు 12 శాతానికి పైగా నష్టపోయింది. ఈ పరిస్థితుల్లో కంపెనీ వివరణ ఇస్తూ స్టాక్ ఎక్స్ఛేంజీలు లేవనెత్తిన హెచ్చరికలు లేదా సూచనలు కంపెనీ కార్యాచరణపై ప్రత్యక్షంగా ఎలాంటి ప్రభావం చూపబోవని పేర్కొంది. ఈ క్రమంలో ప్రస్తుతం టెక్నికల్స్ పరిశీలిస్తే సమీపకాలంలో స్టాక్ ధర రూ.68 స్థాయికి చేరకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో విండ్ ఎనర్జీ పరిష్కారాలను అందిస్తున్న సుజ్లాన్ కంపెనీ షేర్లు గడచిన ఏడాది కాలంలో మంచి రాబడిని అందిస్తూ 156 శాతం పెరుగుదలను చూశాయి. అలాగే దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు 5 ఏళ్ల కాలంలో ఏకంగా 2800% బలమైన రాబడులను పొందారు. ఈ క్రమంలో షేర్ల ధర అత్యల్పంగా రూ.2.41 స్థాయి నుంచి గరిష్ఠంగా రూ.86 స్థాయిలకు పెరిగాయి. ఈ క్రమంలో ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.96 వేల కోట్లుగా ఉంది. దీనికి ముందు కంపెనీ మార్కెట్ క్యాప్ ఏకంగా రూ.లక్ష కోట్ల మార్కును అందుకుంది.
విండ్ టర్బైన్ల తయారీ, విక్రయం, సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్ వ్యాపారంలో అగ్రగామిగా కొనసాగుతున్న కంపెనీ గడచిన నెలలో ప్రభుత్వ యాజమాన్యంలోని ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ నుంచి అతిపెద్ద ఆర్డర్ అందుకుంది. ఈ ప్రాజెక్ట్ కింద దాదాపు 370 వింట్ టర్బైన్ల సరఫరాకు డీల్ అందుకుంది. ఈ ప్రాజెక్ట్ కెపాసిటీ 3.15 మెగా వాట్లుగా ఉంది.


Click it and Unblock the Notifications