Suzlon Energy Q1 Results: దేశీయంగా అనేక కార్పొరేట్ కంపెనీలు ప్రస్తుతం తమ క్యూ1 ఆర్థిక ఫలితాలను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో రెన్యూవబుల్ రంగానికి చెందిన సుజ్లాన్ ఎనర్జీ కంపెనీ అదరగొట్టే లాభాలను నమోదు చేసింది. దీంతో ఇన్వెస్టర్లు కంపెనీ షేర్లపై తమ దృష్టిని సారిస్తున్నారు.
సోమవారం కంపెనీ ప్రకటించిన కన్సాలిడేటెడ్ ఫలితాలు ఇన్వెస్టర్లను అబ్బుర పరుస్తున్నాయి. 2024 ఏప్రిల్-జూన్ మధ్య కాలానికి కంపెనీ లాభాలు ఆకాశమే హద్దుగా చెలరేగాయి. దీంతో లాభాలు గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 200 శాతం పెరిగి రూ.302 కోట్లుగా నమోదైంది. ఇదే క్రమంలో కంపెనీ వ్యాపార ఆదాయం త్రైమాసికంలో 50 శాతం పెరిగి రూ.2,016 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ ఆదాయం కేవలం రూ.1,348 కోట్లుగా ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీ దిశగా అడుగులు వేస్తున్న వేళ భవిష్యత్తులో మరిన్ని వ్యాపార లాభాలను తెచ్చిపెడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ఆనంద్ రాఠి సుజ్లాన్ ఎనర్జీ కంపెనీ షేర్లకు టార్గెట్ ధరను రూ.58గా నిర్ణయించింది. రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం 2025 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను ఆమోదించడానికి సుజ్లాన్ బోర్డు ఈరోజు సమావేశం కానుంది. సుజ్లాన్ ఇటీవలే 52 వారాల గరిష్ట స్థాయి రూ.56.49ని తాకింది. ఇది జూన్ 2010 తర్వాత స్టాక్ చూసిన అత్యధిక ధర.
అలాగే ఐసీఐసీఐ సెక్యూరిటీస్ స్టాక్ టార్గెట్ ధరను రూ.60గా, మోర్గన్ స్టాన్లీ రూ.58.5గా నిర్ణయించాయి. ఆనంద్ రాఠి సుజ్లాన్ డామన్ ప్లాంట్‌ను సందర్శించింది. ఇది విండ్ టర్బైన్‌ల కోసం నాసెల్‌లను తయారు చేస్తుంది. 2004లో ప్రారంభించబడిన ఈ ప్లాంట్ ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేయబడిన 20 గిగావాట్ల (GW) టర్బైన్‌లలో 60%కి పైగా దోహదపడింది. పెరుగుతున్న డిమాండ్ అందిపుచ్చుకోవటానికి కంపెనీ సిద్ధంగా ఉన్నట్లు బ్రోకరేజ్ చెబుతోంది. FY26లో టర్న్‌అరౌండ్ సమయాన్ని తగ్గించడానికి, భద్రతా ప్రమాణాలను పెంచడానికి కంపెనీ తన ప్లాంట్‌ను ఆటోమేట్ చేయాలని యోచిస్తోంది.


Click it and Unblock the Notifications