Suryodaya Small Finance Bank: ప్రజల్లో పెరుగుతున్న ఆర్థిక అక్షరాస్యత కారణంగా తమ డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు వస్తాయోనని రీసెర్చ్ చేస్తున్నారు. దీంతో సాంప్రదాయ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లకు దూరం జరుగుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్, బంగారం, రియల్ ఎస్టేట్ వంటి అధిక రిటర్న్స్ వచ్చే మార్గాలకు మారుతున్నారు. దీంతో ఇటీవల కేంద్రం సహా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు.
కస్టమర్లను ఆకర్షించడానికి వినూత్న డిపాజిట్ ఉత్పత్తులను అభివృద్ధి చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ఆర్థిక సంస్థలకు పిలుపునిచ్చారు. తాజా RBI బులెటిన్‌లో కూడా గవర్నర్ శక్తికాంత దాస్.. మ్యూచువల్ ఫండ్‌లు మరియు పెన్షన్ ఫండ్‌లకు ప్రజలు తమ పొదుపును కేటాయించడంతో బ్యాంకు డిపాజిట్ల వాటా క్షీణించిందని హైలైట్ చేశారు.

దీంతో సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్(SFB) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FD) గరిష్ఠ కాలపరిమితిని ప్రస్తుతం బ్యాంకులు అందిస్తున్న 10 సంవత్సరాలకు మించి మరో 10 ఏళ్లకు పైగా విస్తరించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ తరహా విధానంపై తాము పనిచేస్తున్నట్లు బ్యాంక్ MD మరియు CEO భాస్కర్ బాబు తెలిపారు. దీని రిటర్న్స్‌ను 10 ఏళ్ల గవర్నమెంట్ సెక్యూరిటీల యావరేజ్ గా నిర్ణయించే అవకాశం ఉందంటున్నారు.
ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్‌లోని సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్(SWP) మాదిరిగా ఈ వినూత్న FD పథకంలోనూ క్రమబద్ధమైన ఉపసంహరణ అవకాశాన్ని ఇన్వెస్టర్లకు ఇవ్వాలని బ్యాంక్ భావిస్తోంది. తద్వారా పెట్టుబడిదారులకు ఇది మంచి వ్యూహాత్మక ఆర్థిక ప్రణాళిక ఎంపికగా మారుతుందని చూస్తోంది. ఇది దీర్ఘకాలిక FD ఉత్పత్తి కావడంతో జీవిత బీమా కంపెనీలు అందించే యాన్యుటీ ప్లాన్ తరహాలో పరిమిత కాలానికి ఉండవచ్చనే ఊహాగానాలు ఉన్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications