Viral News: టెక్కీ షాకింగ్ సర్వైవల్ స్టోరీ.. ఏంటి బ్రో మరీ ఇంత దారుణమా..!!
Survival Story: ఐటీ కంపెనీల వ్యాపారాలు ప్రపంచ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంటాయి. గడచిన కొన్ని త్రైమాసికాలుగా ప్రముఖ టెక్ కంపెనీలు సైతం ఉద్యోగుల రిక్రూట్మెంట్ దాదాపు నిలిపివేశాయి. అలాగే సైలెంట్ ఫైరింగ్ కూడా జరిగింది. ఈ క్రమంలో ఉద్యోగం కోల్పోయిన ఒక యువ టెక్కీ షాకింగ్ సర్వైవర్ స్టోరీ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.
రియాజుద్దీన్ అనే ఒక టెక్కీ తన కెరీర్‌లో కష్ట సమయాల్లో ఎలా జీవించాడో వివరిస్తూ సర్వైవల్ స్టోరీని లింక్డ్‌ఇన్ పోస్ట్ చేయగా ప్రస్తుతం అది ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. తాను పనిచేస్తున్న ఐటీ కంపెనీలో ఉద్యోగం కోల్పోయిన సాఫ్ట్‌వేర్ డెవలపర్ తర్వాత స్విగ్గీ డెలివరీ భాగస్వామి ఉద్యోగాన్ని స్వీకరించినట్లు అందులో పేర్కొన్నాడు. ఈ పోస్ట్ "ఎ జర్నీ ఆఫ్ రెసిలెన్స్: మై ఫేర్‌వెల్ టు స్విగ్గీ" అని అతడు రాశాడు. నెలల కిందట అనుకోకుండా ఉద్యోగాన్ని కోల్పోయినప్పుడు తన జీవితం ఊహించని మలుపు తిరిగిందని రియాజుద్దీన్ పేర్కొన్నారు. తాను చెల్లించాల్సిన బిల్లులు పెరుకుపోవటం, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కాకపోవటంతో స్విగ్గీ డెలివరీ బాయ్‌గా మారాలని నిర్ణయించినట్లు చెప్పాడు.

స్విగ్గీ బాయ్‌గా ఉన్నప్పుడు ఉదయం రైడ్స్, మధ్యాహ్నం మండుటెండలో సూర్యుడి వేడి, కుండపోత వర్షాలు, అర్థరాత్రి డెలివరీలు తనకు ఇప్పటికీ గుర్తున్నాయని అన్నాడు. డెలివరీలు కేవలం డబ్బుకు సంబంధించినది కాదని, అది తనకు స్థితిస్థాపకతను తిరిగి పొందడంలో ఒక ముందడుగుగా పేర్కొంటూ తనకు స్విగ్గీ నిజంగా అవసరమైన సమయంలో ఆర్థికంగా అండను ఇచ్చిందని అన్నారు. ఈ పనిని చేయటం సులభమైనది కానప్పటికీ.. తన జీవితంలో తిరస్కరణలు, ఆశ, రోజువారీ కష్టాలను బ్యాలెన్స్ చేసేదన్నాడు. ఈ జర్నీ తనకు సహనం, పట్టుదల, వినయం గురించి అమూల్యమైన జీవిత పాఠాలను నేర్పించిందన్నాడు. అలాగే తాను డెలివరీ చేసిన ప్రతి ఆర్డర్ మరింత బలపరిచిందని పేర్కొన్నాడు.
అయితే వీటన్నింటినీ అధిగమించి ప్రస్తుతం తాను కొత్త కంపెనీలో ఉద్యోగం పొందానని రియాజుద్దీన్ సంతోషాన్ని పంచుకున్నాడు. కొత్త ప్రయాణం కోసం ఉత్సాహంగా ఉన్నానని, స్విగ్గితో తన సమయానికి సరైన వీడ్కోలు చెప్పడానికి నేను కొంత సమయం కేటాయించాలనుకుంటున్నట్లు చెప్పాడు. తన కష్టసమయంలో స్విగ్గీ, కస్టమర్లు అందించిన సపోర్ట్ జ్ఞాపకాలకు నిజంగా రుణపడి ఉంటానని చెప్పాడు. ప్రస్తుతం కష్టతరమైన సమయాన్ని ఎదుర్కొంటున్న ఎవరికైనా అక్కడే ఉండాలని పోస్టులో సూచించాడు. కొన్నిసార్లు జీవితంలో ఊహించని మలుపులు మనం ఊహించని ఎదుగుదల, బలానికి దారితీస్తాయని రియాజుద్దీన్ చెప్పాడు.
ఈ పోస్టును చదివిన వినియోగదారులు స్పందిస్తూ రియాజుద్దీన్ ప్రయాణంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఒక బాధ్యతాయుతమైన కుటుంబ యోధుడివంటూ కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు తెలిపాడు. అలాగే మరో మరొక యూజర్ స్పందిస్తూ ప్రతి పరాజయం కొత్త బలాలను కనుగొనటానికి ఒక అవకాశంగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. జీవితంలో కష్టమైన పరిస్థితులు మిమ్మల్ని బలపరుస్తాయన్నారు.


Click it and Unblock the Notifications