UPI News: ఫిన్‌టెక్ ఇండస్ట్రీకి షాకిచ్చిన సర్వే రిపోర్ట్.. అదే జరిగితే ఎవరూ UPI వాడరని హెచ్చరిక
UPI Charges: అత్యంత సులభంగా, సురక్షితంగా పేమెంట్స్ చేసేందుకు ఇప్పుడు దాదాపు అందరూ వినియోగిస్తున్న వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI). ఈ సేవలను వినియోగిస్తున్నందుకు ఇప్పటి వరకు అయితే ఎటువంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ పేమెంట్ ప్రవేశపెడితే భవిష్యత్తు ఎలా ఉండనుంది అనే విషయంపై ఓ నివేదిక వెలువడింది.
లోకల్ సర్కిల్స్ సర్వే ప్రకారం.. ఛార్జీలు విధించినట్లయితే ఎక్కువ మంది UPI వినియోగదారులు ఆన్‌లైన్ లావాదేవీలను నిలిపివేయవచ్చు. మెజారిటీ ప్రజలు UPIని స్వీకరించడానికి ప్రధాన కారణాలలో ఒకటి జీరో లావాదేవీ రుసుము. ఛార్జీలు ప్రవేశపెట్టినట్లయితే UPI వినియోగ ఎకోసిస్టమ్ తప్పకుండా దెబ్బతింటుందని తెలుస్తోంది.

UPI లావాదేవీల కోసం కొన్ని ప్లాట్‌ఫారమ్‌లు లేదా వ్యాపారులు లావాదేవీ రుసుమును విధిస్తున్నట్లు సర్వేలో తేలింది. ఈ సర్వీసు వినియోగదారులలో 37 శాతం మంది గత ఏడాదిలో తమకు అలాంటి సందర్భం ఎదురైనట్లు తెలిపారు. UPI చెల్లింపుల కోసం IRCTC విధించిన 20 కన్వీనియన్స్ ఫీజుపై వినియోగదారుల నుంచి తరచుగా అభ్యంతరం వ్యక్తమవుతూనే ఉంది.
గత వారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో జరిగిన ఓ సమావేశంలో పలు ఫిన్ టెక్ కంపెనీల ప్రతినిధులు పాల్కొని కీలక ప్రతిపాదనలు చేశారు. UPI లావాదేవీలకు మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR) అమలు చేసే అంశాన్ని లేవనెత్తాయి. ఫిన్‌టెక్ పరిశ్రమ చాలా కాలం నుంచి ఇందుకోసం డిమాండ్ చేస్తోంది. RBI చర్చా పత్రాన్ని అనుసరించి UPI లావాదేవీలపై ఛార్జీలు విధించే ప్రతిపాదన లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications